తొమ్మిది మిలియన్ల జనాభా ఉన్న ఈశాన్య చైనీస్ నగరంలో శుక్రవారం నుంచి లాక్ డౌన్(Lock down) విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. COVID-19 వ్యాప్తిని ఆపడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిలిన్ ప్రావిన్స్ రాజధాని, ముఖ్యమైన పారిశ్రామిక స్థావరం అయిన చాంగ్‌చున్(Changchun)లో అందరు ఇంటి నుంచి పని చేయాలని అధికారులు ఆదేశించారు. నిత్యవసరాల కొనుగోలు చేయడానికి ప్రతి రెండు రోజులకు ఒక వ్యక్తిని అనుమతించనున్నారు. Omicron వేరియంట్ కేసులు చైనాలో భారీగా పెరుగుతున్నాయి. అక్కడ COVID-19 కేసులు 2020 తర్వాత మొదటిసారిగా ఈ వారం 1,000 మార్కును అధిగమించాయి.
గత వారం రోజులుగా షాంఘైలోని పలు పాఠశాలల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. అందరు జాగ్రత్తగా ఉంటూ.. నిబంధనలు పాటించాలని షాంఘై మేయర్ గాంగ్ జెంగ్ గురువారం సోషల్ మీడియా ద్వారా కోరారు. గ్వాంగ్ డాంగ్, జిలిన్, షాండాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. చైనా ప్రత్యేక పరిపాలన ప్రాంతం హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గతవారం నుంచి ఇప్పటి వరకూ ఈ ప్రావిన్సుల్లో 1,100 కేసులు నమోదయ్యాయి. చాంగ్‌చున్‌లో శుక్రవారం 2 కేసులు నిర్ధారణకాగా.. మొత్తం కేసులు 78కి చేరాయి. జిలిన్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారు. అక్కడ 74 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో మిగతా 6 వేల మందికిపైగా క్యారంటైన్‌లో ఉన్నారు.
China imposes lockdown on 9 million residents in northeastern industrial center of Changchun amid new virus outbreak, reports AP
— Press Trust of India (@PTI_News) March 11, 2022
Read Also.. Russia Ukraine War Updates: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సమీపిస్తున్న రష్యా సేనలు.. టాప్-9 న్యూస్ అప్‌డేట్స్