China: డ్రాగన్‌ కంట్రీని భయపెడుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి..

సిచువాన్‌లోని 80 శాతం విద్యుత్ అవసరాలు యాంగ్జీ నది మీద ఏర్పాటు చేసిన హైడల్‌ పవర్‌ స్టేషన్ల ద్వారానే తీరుతాయి. విద్యుత్‌ ఉత్పత్తి లేకపోవడంతో 19 నగరాల్లోని కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.

China: డ్రాగన్‌ కంట్రీని భయపెడుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి..
China

Updated on: Aug 26, 2022 | 7:19 AM

China Economy: ఒకవైపు కరోనా, మరోవైపు ప్రకృతి చైనాను ఫుట్‌బాల్ ఆడేస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని వాతావరణ పరిస్థితులు డ్రాగన్‌ కంట్రీని భయపెడుతున్నాయి. చైనాతోని అతిపెద్ద ప్రావిన్సుల్లో ఒకటైన సిచువాన్‌ కొంతకాలంగా వర్షాలు లేదు. వడగాల్పుల, ఉష్ణోగ్రత్తలు కూడా పెరిగిపోయాయి. ఈ ప్రావిన్స్‌లోని 51 నదులు, 24 రిజర్వాయర్లు ఎండిపోయాయి. చైనాలోనే అతిపెద్ద నది యాంగ్జీనది జీవకళ కోల్పోయింది. నదిలో జలరవాణా ఆగిపోయింది. సాగునీరు అందక పంటలు పూర్తిగా ఎండిపోయాయి.. హుబే, చోంగ్‌కింగ్‌ ప్రావిన్స్‌లతో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది.

సిచువాన్‌లోని 80 శాతం విద్యుత్ అవసరాలు యాంగ్జీ నది మీద ఏర్పాటు చేసిన హైడల్‌ పవర్‌ స్టేషన్ల ద్వారానే తీరుతాయి. విద్యుత్‌ ఉత్పత్తి లేకపోవడంతో 19 నగరాల్లోని కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికీ చైనాలోని చాలా ప్రావిన్స్‌ల్లో కరోనా కొనసాగడంతో లాక్‌డౌన్లు కొనసాగుతున్నాయి. దీనికితోడు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ చైనా ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. దీనికి తోడు రియల్‌ఎస్టేట్‌ సంక్షోభం చైనాకు ఇబ్బంది పెడుతోంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌, హాంకాంగ్‌ను భారీ తుఫాన్‌ పలకరించింది. దీనికి “మా ఆన్‌” అని పేరు పెట్టారు. తుఫాను బీభత్సం భారీ నష్టాన్నే మిగిల్చే అవకాశం ఉంది. తుఫాను కారణంగా హాంకాంగ్‌లో స్టాక్‌మార్కెట్లు కూడా బంద్‌ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..