హాంకాంగ్ లో అదే ప్రజా వెల్లువ.. లక్షల్లో పోటెత్తిన జనం..
హాంకాంగ్ లో ప్రజా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా వైఖరిని దుయ్యబడుతూ లక్షలాది ప్రజలు ఆదివారం అక్కడి విక్టోరియా పార్క్ వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ పట్టించుకోకుండా గొడుగులు పట్టుకునే ఆందోళన నిర్వహించారు. నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనకారులు నెల రోజులకు పైగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రొటెస్టర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం యుధ్ధ శకటాల వంటి వాహనాలను సిధ్ధంగా ఉంచింది. […]

హాంకాంగ్ లో ప్రజా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా వైఖరిని దుయ్యబడుతూ లక్షలాది ప్రజలు ఆదివారం అక్కడి విక్టోరియా పార్క్ వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ పట్టించుకోకుండా గొడుగులు పట్టుకునే ఆందోళన నిర్వహించారు. నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనకారులు నెల రోజులకు పైగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రొటెస్టర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం యుధ్ధ శకటాల వంటి వాహనాలను సిధ్ధంగా ఉంచింది. అటు-హాంకాంగ్ వాసులకు మద్దతుగా అమెరికా ప్రకటనలు చేయడాన్ని చైనా దుయ్యబడుతోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని హెచ్ఛరించింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు విద్యుత్ షాక్ లు ఇచ్ఛే పొడవాటి ఫోర్క్ లను వాడేందుకు చైనా సైనికులకు, పోలీసులకు శిక్షణ ఇస్తున్న దృశ్యాలను చైనా పత్రికలు ఫొటోలుగా ప్రచురించిన సంగతి విదితమే.. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. అసలే చైనా- యుఎస్ మధ్య టారిఫ్ వార్ కొనసాగుతోంది. తమ దేశ ఉత్పత్తులపై చైనా విపరీతంగా సుంకాలు పెంచడం పట్ల అమెరికా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్ వాసుల ఆందోళనను సాకుగా చూపి అమెరికా.. చైనా మీద అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అయితే చైనా సైతం తామూ వెనక్కి తగ్గేదిలేదని అమెరికాకు వార్నింగ్స్ ఇస్తుండడంతో.. ఇది రెండు దేశాల మధ్య మరింత ‘ అగ్గి ‘ రాజుకునేందుకు దారి తీస్తుందేమోనని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

