క్షీణిస్తున్న జననాల దృష్ట్యా చైనా దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. నజరానాలు ప్రకటించి మరీ జననాలను ప్రొత్సహిస్తోంది. దీంతో ఎంతమంది కావాలంటే అంతమందిని కనండంటూ సిచువాన్ ప్రావిన్స్‌లోని జంటలకు చైనా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. 1979లో తీసుకొచ్చిన ఏక సంతానం పాలసీ (one child policy)పై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. వన్-చైల్డ్ పాలసీని అతిక్రమించినందుకు జంటలకు చైనా ప్రభుత్వం జరిమానాలు విధించేది. ఎందరో ఉద్యోగాలు కూడా కోల్పోయారు. మహిళలకు బలవంతంగా అబార్షన్లు చేయించేవారు. ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ జనాభా నియంత్రణ చేయడంలో చైనా విఫలమైంది. దీంతో 2016లో ఈ పాలసీని చైనా రద్దు చేసింది.
ఆ తర్వాత తొలిసారిగా 2021లో దంపతులు ముగ్గురు సంతానానికి జన్మిఇచ్చేందుకు అవకాశం కల్పించింది. అయినప్పటికీ గడిచిన అరవైఏళ్లలో ఎన్నడూలేని విధంగా 2022లో చైనా జనాభా సంఖ్య ఘనణీయంగా పడిపోయింది. కోవిడ్ కారణంగా చైనాలో 10.41 మిలియన్ల మరణాలు సంభవించాయి. మరణాలకు పూర్తి వ్యతిరేకంగా 9.56 మిలియన్ల జననాలు మాత్రమే సంభవించాయి. దీంతో గత ఏడాది చైనా జనాభా 1.411.75 బిలియన్లకు తరిగిపోయింది.
తొలిసారిగా గతేడాది కరోనా కారణంగా ఆ దేశంలో మరణాలు భారీగా పెరిగాయి. దీనికితోడు జననాల రేటు కూడా ధారుణంగా పడిపోయింది. దీంతో చైనాకు నైరుతి భాగంలో 80 మిలియన్ల జనాభా ఉన్న సిచువాన్‌లో జనాభా నియంత్రణపై ఉన్న నిబంధనలను ఎత్తి వేసింది. కొత్తగా తీసుకొచ్చిన మార్పు వల్ల అవివాహితులైన యువతులు కూడా పిల్లలను పెంచుకోవడానికి అనుమతి లభించింది. గతంలో ఒంటరి మహిళలు పిల్లలను పెంచుకోవడంపై నిషేదం ఉండేది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ జననాల రేటును పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు ట్యాక్స్ సడలింపుతోపాటు సురక్షితమైన ఆరోగ్య పాలసీలను అందించడం ప్రారంభించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.