Galwan Incident: గాల్వన్ ఘటనపై నోరు విప్పిన జిత్తుల మారి.. తమ సైనికులు కూడా చనిపోయారంటూ నిజాన్ని అంగీకరించిన చైనా
Galwan Incident: గాల్వన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నోరు విప్పింది. పూర్తిగా నిజాన్ని అంగీకరించపోయినా ఒక దారికొచ్చింది. గత ఏడాది గాల్వన్ లోయలో ...
Galwan Incident: గాల్వన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నోరు విప్పింది. పూర్తిగా నిజాన్ని అంగీకరించపోయినా ఒక దారికొచ్చింది. గత ఏడాది గాల్వన్ లోయలో భారత- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులైనట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ చైనాలో ఎంత మంది సైనికులు చనిపోయారన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. డ్రాగన్ ఎప్పుడు ఒక మాట మీద నిలబడే తత్వం కాదు. ఎప్పటికప్పుడు ఉసరవెల్లిలా మాటలు మార్చుతుంది. ఇక గాల్వన్ జరిగిన ఘర్షణలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. చనిపోయిన వారి పేర్లను సైతం ప్రకటించింది. ఇప్పటికే చైనా సైనికులు 45 మంది వరకు మృతి చెందినట్లు ఇతర దేశాలు చెబుతున్నప్పటికీ చైనా మాత్రం తమ సైనికులెవ్వరూ చనిపోలేదని బూకాయిస్తూ వచ్చింది. ఇక ఈ ఘటనలో 45 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు ఇటీవల రష్యా ప్రకటించిన వారం రోజుల్లోనే చైనా ఈ విషయాన్ని బయటపెట్టడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గాల్వన్‌లో ఘర్షణ జరిగిన తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాత్రం ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారన్నది చెప్పలేదు.
ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికుల్లో పీఎల్‌ఏ జింగ్‌జాంగ్ మిలటరీ కమాండర్‌కు చెందిన క్యూఫాబవో ఉన్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. పలు మార్లు సైనిక, దౌత్య చర్చలు జరిగాయి. అయితే రెండు రోజుల నుంచి పాన్‌గంగ్ సరస్సు వద్ద ఉన్న ప్రాంతం నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తమ దళాలను వెనక్కి రప్పిస్తోంది.