స్పీడ్‌గా ఉన్న కారుపై కొండ చిలువ.. ఆ జంట చేసిన పనిని చూసి తీవ్రంగా తప్పుబడుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్‌

కారులో ప్రయాణిస్తున్న ఓ జంటకు కొండ చిలువ ఊహించని షాక్‌ ఇచ్చింది. కారు కదులుతుండగానే అది కారు ముందు అద్దం మీదకు వచ్చేసింది. దీంతో ఆ పామును చూసిన డ్రైవర్‌ ...

స్పీడ్‌గా ఉన్న కారుపై కొండ చిలువ.. ఆ జంట చేసిన పనిని చూసి తీవ్రంగా తప్పుబడుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 18, 2021 | 3:55 PM

కారులో ప్రయాణిస్తున్న ఓ జంటకు కొండ చిలువ ఊహించని షాక్‌ ఇచ్చింది. కారు కదులుతుండగానే అది కారు ముందు అద్దం మీదకు వచ్చేసింది. దీంతో ఆ పామును చూసిన డ్రైవర్‌ ఒక్కసారిగా భయపడిపోయాడు. విండ్‌ స్క్రీన్‌ వైపర్‌ (అద్దం మీద నీటిని శుభ్రం చేసే పరికరం)తో ఆ కొండ ఆ కొండ చిలువను కారు మీద నుంచి తొలగించాలని భావించాడు. కానీ ఆ పాము మరోలా స్పందించింది. ఒక్కసారిగా డ్రైవర్ విండో వైపు వచ్చింది.

ఆస్ట్రేలియాలోని క్వీన్‌ల్యాండ్‌లో గల బ్రూస్‌ హైవే మీద ఈ ఘటన చోటు చేసుకుంది. మెలిస్సా హడ్సన్‌, ఆమె పార్టనర్‌ డోడ్నే గ్రిగ్స్‌ కారులో అలిగేటర్‌క్రీక్ కు బయలుదేరారు. అయితే కారు వేగంగానే ప్రయాణిస్తుండగా, ఓ కొండ చిలువ కారు అద్దం ముందు ప్రత్యక్షమైంది. అది కారు ముందు అద్దం మీదకు పాకింది. వారు కారును ఆపకుండా వైపర్‌తో తొలగించాలని అనుకున్నారు. చివరికి అది కారు మీదన ఉంచి కింద పడకుండా డ్రైవర్‌ విండో మీదకు వచ్చింది. ఆ తర్వాత వారు కారును రోడ్డు పక్కకు ఆపి పొదల్లోకి వదిలారు.

అయితే వారు కొండ చిలువను వైపర్‌తో తొలగించాలని ప్రయత్నించడాన్ని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అలా చేయడం వన్య ప్రాణులను హింసించడం కిందకే వస్తుందని తప్పుబడుతున్నారు. ఆ కొండ చిలువ గాయపడినా, చనిపోయినా వారు నేరం చేసినట్లేనని నెటిజన్లు చెబుతున్నారు. అయితే వైపర్‌తో తొలగించడానికి బదులు… కారును పక్కన నిలిపివేసి వదిలిపెట్టాల్సిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

దీనిపై మెలిస్సా హడ్సన్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ కంట్రోలర్‌ నిఘా ఉండటం వల్ల కారును అప్పటికప్పుడు ఆపడం సాధ్యం కాలేదు. ఆ కారు వేరే మార్గం ద్వారా కారు లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ భయంతోనే దానిని వైపర్‌తో తొలగించాలని ప్రయత్నించాం.. లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉండేది అంటూ చెప్పుకొచ్చారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!