AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPhone XS Fall in Sea: ఫోటో తీస్తుండగా సముద్రంలో పడిన సెల్ ఫోన్.. దానికోసం గడ్డకట్టే నీటిలో దూకిన వ్యక్తి ఎక్కడంటే..!

సముద్రంలో పడిపోతే ఓ వ్యక్తి ఏకంగా ఆ ఫోన్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ సముద్రంలో దూకాడు.. మంచు వంటి చల్లటి నీటిలో దూకి ఫోన్ ను రక్షించుకున్న ఘటన ఒకటి కెనడాలో చోటు చేసుకుంది...

IPhone XS Fall in Sea: ఫోటో తీస్తుండగా సముద్రంలో పడిన సెల్ ఫోన్.. దానికోసం గడ్డకట్టే నీటిలో దూకిన వ్యక్తి ఎక్కడంటే..!
Surya Kala
|

Updated on: Feb 19, 2021 | 6:07 PM

Share

IPhone XS Fall in Sea: ప్రస్తుతం గాలి పీల్చకుండానైనా మనిషి క్షణ కాలం జీవిస్తాడేమోగానీ.. చేతిలో ఫోన్ లేకుండా అరక్షణం కూడా బతకలేడు.. ప్రపంచాన్ని అంతటినీ అరచేతిలో చూపించే ఈ స్మార్ట్ ఫోన్.. మనిషికి మనిషి ఏమీ కాకుండా చేస్తోంది. ఇక అలాంటి ఫోన్ సముద్రంలో పడిపోతే ఓ వ్యక్తి ఏకంగా ఆ ఫోన్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ సముద్రంలో దూకాడు.. మంచు వంటి చల్లటి నీటిలో దూకి ఫోన్ ను రక్షించుకున్న ఘటన ఒకటి కెనడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కెనడాలోని విక్టోరియాకు చెందిన రోమన్ జార్నోమ్స్ అనే వ్యక్తి ఫిబ్రవరి 14 న విక్టోరియా హార్బర్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్నాడు.. ఆ సమయంలో ఎంప్రస్ వద్ద నీరు గడ్డకడుతున్న సుందర దృశ్యాన్ని చూశాడు.. వెంటనే దానిని తన సెల్ లోని కెమెరాతో బంధించాలని భావించాడు. అయితే జార్నోమ్స్ చేతి నుంచి ఐఫోన్ XS ఫోన్ జారిపడి నేరుగా విక్టోరియా నదిలో సముద్రంలో పడిపోయింది. ఆ ఫోన్ ను సముద్రం నుంచి తీసుకోవడానికి అతను గడ్డకట్టే నీటిలో దూకి…. కొన్ని గంటల పాటు ఆ గడ్డ కట్టే నీటిలో చలికి తట్టుకుంటూ ఫోన్ వెదికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఫోన్ ను తీసుకోవడంకోసం విక్టోరియా నౌకాశ్రయంలో వెలుతురు వచ్చే వరకూ వేచి ఉన్నానని జార్నోమ్స్ చెప్పాడు.

అయితే ఈ ఫోన్ నీటిలో మునిగిపోయినప్పటికీ బాగా పనిచేస్తోందని సంతోషంవ్యక్తం చేస్తున్నాడు జార్నోమ్స్. అయితే ఎన్ని రోజులు పనిచేస్తుందనేది తనకు తెలియదని చెప్పాడు.. ఇక ఈ ఐఫోన్ XS ఫోన్ 2018 లో లాంచ్ అయ్యింది.. అప్పట్లోనే ఈ ఫోన్ దుమ్ము, నీటిలో పడినా సురక్షితంగా ఉంటుందని కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కు అప్పట్లోనే భారీ రేటింగ్ సంపాదించుకుంది.

అప్పు తీర్చలేదని మహిళ లోదుస్తులను వేలానికి పెట్టి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దేశం..

గాల్వన్‌ ఘటనపై నోరు విప్పిన జిత్తుల మారి.. తమ సైనికులు కూడా చనిపోయారంటూ నిజాన్ని అంగీకరించిన చైనా

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!