మార్పు కోరుకున్నారు.. 16 ఏళ్ల పాలకు చెక్ పెట్టారు. జర్మనీలో జరిగిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. పాలనలో మార్పులు తెచ్చుకున్నారు. అక్కడి ప్రజలు మార్పుకే ఓటేశారు. 16 ఏళ్ల పాటు జర్మనీని ఏలిన ఏంజెలా మెర్కల్ పార్టీ.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. తాజాగా ముగిసిన ఎన్నికల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీకి అత్యధికంగా 25.7 శాతం ఓట్లు పోలయ్యాయి. ఛాన్సలర్ మెర్కల్‌కు చెందిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ కన్జర్వేటివ్ పార్టీకి 24.1 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే రెండు పార్టీల మధ్య కేవలం 1.6 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది.
సోషల్ డెమోక్రటిక్ పార్టీ నేత ఓలాఫ్ స్కల్జ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కన్జర్వేటి నేత ఆర్మిన్ లాషెట్ కూడా విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నించనున్నారు. గతంలో రెండు పార్టీలు కలిసి పనిచేసినా.. ఈ సారి మాత్రం ఆ ఇద్దరూ వేరువేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని గ్రీన్స్, లిబరల్ పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి.
జర్మన్ల అభిప్రయాలను ఎగ్జిట్ పోల్స్ డెడ్ హీట్ ముందే అంచనా వేసింది. అయితే ఈ ఎన్నికలు ప్రారంభం నుండి అనూహ్యమైనవి ఫలితం ఎప్పటికీ ముగింపు కాదు. ఒక విషయం ఏమిటంటే కూటమి ఏర్పడే వరకు అవుట్‌గోయింగ్ ఛాన్సలర్ ఎక్కడికీ వెళ్లడం లేదు అది క్రిస్మస్ వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.