నైజీరియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ నైజీరియాలో బాంబు పేలుడు సంభవించింది. ఉత్తర నైజీరియా సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 27 మందికి పైగా మరణించినట్టు సమాచారం. నైజీరియాలోని బౌచి సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. కాగా.. మరణించిన వారిలో ఎక్కువ మంది పశువుల కాపరులే ఉన్నారు. బాంబ్ బ్లాస్ట్‌లో పశువులు కూడా చనిపోయినట్టు నైజీరియా ప్రభుత్వ ప్రతినిధి, జాతీయ పశువుల పెంపకందారుల ప్రతినిధి వెల్లడించారు. నసరవా, బెన్యూ రాష్ట్రాల మధ్య బాంబు పేలుడు సంభవించింది. నైజీరియాకు చెందిన మియాతి అల్లా పశువుల పెంపకందారుల సంఘం ప్రతినిధి తసియు సులైమాన్ మాట్లాడుతూ.. ఫులానీ పశువుల కాపరులు తమ పశువులను బెన్యూ నుండి నసరవాకు తరలిస్తున్నారని, అక్కడ మేత వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించినందుకు అధికారులు జంతువులను జప్తు చేశారని చెప్పారు. ఘటనా స్థలంలో మరింత మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పేలుడు మూలాన్ని పోలీసు బాంబు నిపుణులు విచారిస్తున్నారని మహ్మద్ బాబా చెప్పారు.
పశువుల కాపరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందంలోని సభ్యుడు సైనిక దాడి కారణంగా పేలుడు సంభవించినట్లు సమాచారం. నైజీరియా వైమానిక దళం ప్రతినిధి ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించినట్లు తెలిసింది.
Twenty-seven herders were killed while several others were injured in a bomb explosion in central Nigeria, a region known for ethnic and religious tensions, AFP reported
— ANI (@ANI) January 25, 2023
సెంట్రల్ నైజీరియాలో పశువుల కాపరులు, రైతులు తమ పశువులకు ఆహారం, నీరు అందించటానికి కూడా కష్టపడుతున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో జాతి, మతపరమైన కోణాన్ని సంతరించుకుంది.