Canada Job Vacancies: రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకునేటట్లు కనిపించడం లేదు. ఆర్ధిక, పారిశ్రామిక రంగాలతోపాటు జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రపచ వ్యాప్తంగా కోట్లాది మంది తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. అనేక కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయి ఆకలితో అల్లాడుతున్నాయి. అయితే ఇదే సమయంలో చాలా దేశాల్లో ఉద్యోగుల కొరతతో అల్లాడుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్రాబ్లెమ్ తో అమెరికా ఇబ్బంది పడుతుండగా.. తాజాగా కెనడా కూడా ఉద్యోగుల కొరతతో ఇబ్బంది పడుతుంది.
కెనడా అధికారిక లెక్కల ప్రకారం.. 2021 సంవత్సరం మూడవ త్రైమాసికంలో 9,12,600 ఉద్యోగాలు ఖాళీలున్నాయని తెలుస్తోంది.
కెనడాలో 2019 ప్రారంభంలో అన్ని రంగాలతో కలిపి సుమారు 3,49,700 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఉద్యోగాల ఖాళీల సంఖ్యరెట్టింపయినట్లు తెలుస్తోంది. కెనడాలో వ్యవసాయ రంగం, రియల్ ఎస్టేట్, ఫారెస్ట్రి, ఫిషింగ్, హంటింగ్ ఈ రంగాల్లో మినహా మిగిలిన రంగాల్లో భారీగా ఖాళీలు ఉన్నట్లు ముఖ్యంగా 2019 మూడవ త్రైమాసికం నుంచి 2021 మూడవ క్వార్టర్ మధ్యలో 18 రంగాల్లో ఖాళీలు పెరిగినట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ, నిర్మాణం, వసతి , ఆహారం, రిటైల్ వాణిజ్యం , వస్తు తయారీ రంగాల్లో భారీగా ఖాళీలు ఏర్పడడంతో కెనడాలో ఈ పరిస్థితి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తక్కువ జీతాలు ఉండే రంగాల్లో మాత్రమే భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. 2019 మూడవ త్రైమాసికం 2021 మూడవ త్రైమాసికం మధ్య తక్కువ-వేతన వృత్తులలో ఖాళీలు ఎక్కువగా పెరిగాయి. 48.9 శాతం ఉద్యోగ ఖాళీలను ఏర్పడ్డాయి.
దీంతో కెనడాస్ ప్రధాని జస్టిన్ ట్రూడో దేశ ఆర్ధిక వృద్ధి కోసం చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే కెనడా ప్రభుత్వం భారీగా ఇమ్మిగ్రేషన్ విధానాలను సడలించడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జస్టిన్ ట్రూడో 2022 ఏడాదిలో 4,11,000 మందికి శాశ్వత పౌరసత్వం అందించాలనుకుంటున్నామని తెలిపారు. అయితే ఇలా ఉద్యోగస్తుల కొరతకు కారణం కెనడియన్లలో సంతానోత్పత్తి రేటు తగ్గడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ప్రజలు పిల్లలను కనేలా చర్యలు తీసుకోవాలని బహుమతి విధానం ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: నిండుకుండలా తుంగభద్ర జలాశయం.. 39 ఏళ్ల తర్వాత భారీ నిల్వలు.. ఆయకట్టు రైతులలో ఆనందం..