AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brics Summit 2023: బ్రిక్స్‌ కూటమి విస్తరణ.. కొత్తగా ఆరుదేశాలకు చోటు.. కొత్త శక్తి వచ్చిందన్న ప్రధాని మోడీ

ఇప్పటివరకు ఐదు దేశాల కూటమిగా ఉన్న ‘బ్రిక్స్‌’ మరింత విస్తరించనుంది. కొత్తగా మరో ఆరు దేశాలు చేరనున్నాయి. ఇందుకు కూటమి సభ్యదేశాలు అంగీకరించాయి. బ్రిక్స్​లో ఆరు కొత్త దేశాలను చేర్చుకోవడం వల్ల కూటమికి కొత్త శక్తి వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రిక్స్ కూటమి విస్తరణ, ఆధునీకరణ.. అంతర్జాతీయ సంస్థలన్నీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు.

Brics Summit 2023: బ్రిక్స్‌ కూటమి విస్తరణ.. కొత్తగా ఆరుదేశాలకు చోటు.. కొత్త శక్తి వచ్చిందన్న ప్రధాని మోడీ
Brics
Surya Kala
|

Updated on: Aug 25, 2023 | 6:48 AM

Share

బ్రిక్స్ కూటమి దేశాధినేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిక్స్ కూటమిలో మరో ఆరు కొత్త సభ్య దేశాలను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అర్జెంటీనా, ఈజిప్ట్​, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​కు బ్రిక్స్ కూటమిలో చోటు దక్కనుంది. కొత్త సభ్య దేశాలు 2024 జనవరి 1 నుంచి బ్రిక్స్ కూటమిలో భాగమవుతాయని బిక్స్ దేశాధినేతలు ప్రకటించారు. ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. మీడియా సమావేశం ఏర్పాటు చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వాలతో కలిసి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా బ్రిక్స్ సదస్సుని విస్తరిస్తున్నట్లు .. మరో అరుదేశాలు బ్రిక్స్ తో కలిసి పని చేయనున్నామని ప్రకటించారు.

బ్రిక్స్​లో ఆరు కొత్త దేశాలను చేర్చుకోవడం వల్ల కూటమికి కొత్త శక్తి వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బ్రిక్స్ కూటమి విస్తరణ, ఆధునీకరణ.. అంతర్జాతీయ సంస్థలన్నీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన సదస్సులో అనేక సానుకూల ఫలితాలు వచ్చాయని భారత ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్‌ దేశాల మూడురోజుల సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ మీడియాతో అనేక విషయాలను మాట్లాడారు.

ఈ మేరకు బ్రిక్స్ కూటమిలో మరో 6 సభ్య దేశాలను చేర్చుకోనున్నట్లు చెప్పారు. బ్రిక్స్‌ సదస్సులో భారత్‌-చైనా అధినేతల మధ్య ప్రత్యేక భేటీ కానున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నప్పటికీ అటువంటి సమావేశం జరగలేదు. కానీ, వేదికపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ల మధ్య సంభాషణ చోటుచేసుకుంది. మోడీ ఏదో చెబుతుండగా.. జిన్‌పింగ్‌ దాన్ని వింటూ ముందుకు సాగారు. సమావేశం అనంతరం ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. చివరిసారిగా గతేడాది నవంబరులో బాలిలో జరిగిన జీ20 సదస్సులో ఇరు దేశాధినేతలు మాట్లాడుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..