పబ్లిక్‌గా ఉండే స్విమ్మింగ్ పూల్స్‌లో ఇకపై మహిళలు సైతం టాప్‌లెస్ స్విమ్మింగ్ చేయొచ్చని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ హక్కును ఓ మహిళ పోరాడి మరీ సాధించింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.? అసలు టాప్‌లెస్ స్విమ్మింగ్ కోసం ఆ మహిళ ఎందుకు పొరాడింది లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. జర్మనీలో కొన్ని నగరాల్లో పబ్లిక్ పూల్స్ వద్ద టాప్‌లెస్ స్విమ్మింగ్‌కు అనుమతి ఉంది. అయితే ఒక్క బెర్లిన్ నగరంలో మాత్రం ఈ అనుమతి లేదు.
ఇటీవల బెర్లిన్‌కు చెందిన మహిళ స్థానికంగా ఉన్న ఓ ఓపెన్-ఎయిర్ పూల్‌లో టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేసింది. అయితే అక్కడి సిబ్బంది దీనికి అభ్యంతరం చెప్పి సదరు మహిళను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో స్విమ్మింగ్ పూల్‌లో దుస్తుల విషయంలో మహిళలకు సమానత్వం కల్పించాలని, పురుషుల్లాగే టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసేందుకు అనుమతి కల్పించాలని కోరుతూ.. సెనేట్ అంబుడ్స్‌పర్సన్ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. ఇకపై బెర్లిన్‌లోని పబ్లిక్ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్మిమ్మింగ్ చేసుకునేందుకు అంగీకరించారు. ఇందులో భాగంగా బెర్లిన్‌లో పబ్లిక్ పూల్స్‌ని నిర్వహించే బెర్లినర్ బేడర్బెట్రీబ్ దుస్తుల నిబంధనలను మార్చేసింది. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయనే దానిపై క్లారిటీ రాలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..