పెళ్లిరోజు నాడే షేక్ హసీనాకు మరణశిక్ష ఖరారు..! ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నారో తెలుసా?
బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన అల్లర్ల కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని సీరియస్ అయ్యింది. గతేడాది జూలై-ఆగస్టు నెలల్లో జరిగిన ఆందోళనలలో 1,400 మంది మృతి చెందారని న్యాయమూర్తి చెప్పారు. తనకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టులో రుజువైంది.

బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన అల్లర్ల కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని సీరియస్ అయ్యింది. గతేడాది జూలై-ఆగస్టు నెలల్లో జరిగిన ఆందోళనలలో 1,400 మంది మృతి చెందారని న్యాయమూర్తి చెప్పారు. తనకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టులో రుజువైంది. ఈ క్రమంలోనే ఆమెపై విచారణ జరిపిన అక్కడి కోర్టు.. ఆమెకు మరణశిక్ష విధించింది. షేక్ హసీనా పెళ్లిరోజు నవంబర్ 17 కావడం విశేషం. ఆమె జీవితంలోని ప్రత్యేక రోజున ఆమెకు చెత్త వార్త అందింది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ముగ్గురు సభ్యుల ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది.
షేక్ హసీనా భర్త ఎవరు?
మీడియా కథనాల ప్రకారం, షేక్ హసీనా 1967లో ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త ఎం.ఎ. వాజెద్ మియాను ఆమె తల్లి ఫజిలాతున్ నెస్సా పర్యవేక్షణలో వివాహం చేసుకుంది. అదే సమయంలో షేక్ ముజిబుర్ రెహమాన్ జైలులో ఉన్నాడు. బంగ్లాదేశ్ టైమ్స్ ప్రకారం, ఫజిలాతున్ నెస్సా ఆ జంటకు నికాహ్ ఏర్పాటు చేసింది. వాజెద్ మియా మే 9, 2009న 67 సంవత్సరాల వయసులో మరణించింది. షేక్ హసీనా-ఎం.ఎ. వాజెద్ మియా దంపతులకు సజీబ్ వాజెద్ జాయ్, సైమా వాజెద్ పుతుల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సజీబ్ వాజెద్ జాయ్ జూలై 27, 1971న జన్మించారు. సైమా వాజెద్ పుతుల్ డిసెంబర్ 9, 1972న జన్మించారు.
షేక్ హసీనా ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె మొదట 1996 నుండి 2001 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె 2009 నుండి 2014 వరకు రెండవసారి, 2014 నుండి 2019 వరకు మూడవసారి, 2019 నుండి 2024 వరకు నాల్గవసారి, 2024లో ఐదవసారి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. అయితే, విద్యార్థుల నిరసనల కారణంగా షేక్ హసీనా ఆగస్టు 5, 2024న పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
2024లో జరిగిన విద్యార్థి రిజర్వేషన్ సంస్కరణ ఉద్యమం సామూహిక తిరుగుబాటుగా మారింది. ఆ సంవత్సరం జూలై-ఆగస్టులో, పోలీసులు విద్యార్థి ఉద్యమంపై, అలాగే అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థలైన ఛత్రా లీగ్, జూబ్లీ లీగ్ కు చెందిన వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఫలితంగా, రిజర్వేషన్ సంస్కరణ ఉద్యమం ప్రభుత్వ పతనానికి దారితీసింది.
హసీనా తోపాటు నిందితులు ఎవరు?
హసీనాతో పాటు, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) చౌదరి అబ్దుల్లా అల్-మామున్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. హసీనా, ఖాన్ దేశంలో లేనందున, మాజీ IGP పోలీసు సాక్షి అయ్యారు. అతను క్షమాపణలు చెప్పాడు. కోర్టు అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
అప్రూవర్‌గా మారిన మాజీ IGP
విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించాలని అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా నేరుగా ఆదేశించారని అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్-మామున్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. గత ఏడాది జూలై 18న అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ద్వారా షేక్ హసీనా నుండి ఈ ఆదేశం తనకు అందిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 23న విచారణ ముగిసిన తర్వాత, తీర్పు, శిక్ష విధించే తేదీని మొదట నవంబర్ 14కి నిర్ణయించారు. తరువాత, నవంబర్ 13న, హసీనా, ఆమె ఇద్దరు ముఖ్య సహాయకులపై కేసులో నవంబర్ 17న తీర్పు వెలువరిస్తామని ICT ప్రకటించింది. చివరికి అదే జరిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
