Australia: తమకు ఉన్న తెలివి తేటలను మంచి పనులకు ఉపయోగించేవారున్నారు. చెడు మార్గంలో పయనించేవారున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్, సోషల్ మీడియా (Social Media) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం అంతా అరచేతిలో దర్శనమిస్తుంది. ఇంట్లో ఉన్నవారిని దూరం చేస్తోంది.. ఎక్కడెక్కడివారినో ఒకటి చేస్తోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా డేటింగ్ చాలా ఈజీగా సెట్ అవుతుంది. రోజు రోజుకీ ఆన్ లైన్ లో డేటింగ్ సైట్స్ (Dating sites) , యాప్స్ (aaps) పెరిపోతున్నాయి. వీటి ద్వారా, అమ్మాయిలు, అబ్బాయిలు తమకు కావాల్సిన పాట్నర్ను చాలా ఈజీగా వెదుకుంటున్నారు. ఎంత ఈజీగా పార్ట్ నర్ దొరుకుతున్నారంటే.. బట్టలు మార్చుకునేంత ఈజీగా రోజుకి ఒకరిని మార్చుకునేలా దొరుకుతున్నారు. ఇందుకు ఉదాహరణ ఓ యువతి.. 21 రోజుల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేసింది ఈ చిన్నది. అంతేకాదు పార్ట్‌నర్‌ని వెతుక్కోవడానికి టిండర్ యాప్ సరైన ఎంపిక అంటోంది.. ఈ యాప్‌లో కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటిస్తే… కుర్రాళ్లు ఈజీగా దొరుకుతారని అంటోంది ఆస్ట్రేలియా యువతి వివరాల్లోకి వెళ్తే..
సిడ్నీలో పుట్టిన హెలెన్ చిక్ కు ఎక్కువ కాలం ఒకే రిలేషన్ ను మెయింటైన్ చేయాలంటే ఇష్టం ఉండదు.. ఈ చిన్నదానికి షార్ట్ మెమరీస్ అంటే ఇష్టం. అంతేకాదు హెలెన్ చిక్ దృష్టిలో డేటింగ్ అంటే నంబర్స్ గేమే. అందుకనే ఎవరితోనూ లాంగ్ రిలేషన్‌షిప్ పెట్టుకోవట్లేదు. తనకు పరిచయమైన బాయ్మా ఫ్రెండ్స్ కు మార్ణింగ్ హాయ్ అంటూ స్వాగతం చెబుతుంది.. రాత్రికి బాయ్ అని.. రిలేస్ కు వీడ్కోలు చెబుతుంది. అంతేకాదు హెలెన్.. ఇటీవల మూడు వారాల పాటూ న్యూయార్క్ ట్రిప్‌కి వెళ్లింది. అక్కడ 15 మందితో డేటింగ్ చేసిందట. అంటే 21 రోజుల్లో 15 మంది వేర్వేరు పురుషులతో టిండెర్ డేట్‌లను కలిగి ఉన్నానని గొప్పగా చెప్పింది.
“సెక్స్, స్వైప్స్ , అదర్ స్టోరీస్” అనే పుస్తకాన్ని వ్రాసిన సీరియల్ డేటర్, “కిండా సోర్టా డేటింగ్” అనే పోడ్‌కాస్ట్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తక్కువ సమయంలో ఎక్కువ మంది పురుషులను ఎలా కలుసుకోగలిగిందో వివరించింది. “గడిచిపోయిన కాలం తిరిగిరాదు, అందుకే తాను సమయాన్ని సద్వినియోగాన్ని వినియోగించుకుంటామని తెలిపింది. చిక్ మాట్లాడుతూ, సమయం చాలా ముఖ్యమైనది. వ్యక్తిగతంగా కలవడానికి ముందు చిన్న చర్చలతో సమయాన్ని వృథా చేయవద్దని టిండెర్ వినియోగదారులకు సూచనలు చేస్తోంది. అంతేకాదు చిక్ తన డేటింగ్ అనుభవాల వివరిస్తూ.. ఓ పుస్తకాన్ని రాసింది.
Also Read: Palm Rash: మీ అర చేతి మీద ఇలాంటి రాషెస్ కనిపిస్తే.. దీర్ఘకాలిక అనారోగ్యానికి సంకేతమట