ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ప్రయాణికుల బస్సు.. 24 మంది దుర్మరణం..

దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరూ రాజధాని లిమాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది మరణించగా, అనేక మంది గాయపడినట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ప్రయాణికుల బస్సు.. 24 మంది దుర్మరణం..
Peru Accident

Updated on: Jan 29, 2023 | 8:30 AM

దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరూ రాజధాని లిమాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది మరణించగా, అనేక మంది గాయపడినట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. ‘డెవిల్స్ కర్వ్’గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 24 మంది మరణించారని పెరూ పోలీసులు తెలిపారు.

కరీబియన్ దేశం హైతీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కొరియాంకా టూర్స్ కంపెనీ బస్సు లిమా నుంచి బయలుదేరి ఈక్వెడార్ సరిహద్దులోని టుంబేస్‌కు వెళ్తోందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బస్సు ఆర్గానోస్ నగరం సమీపంలో కొండపై నుంచి పడిపోయిందని.. ఇది డేంజరస్ స్పాట్ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, పెరూలో రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగమే కారణాలని పెరూ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటనలో తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us