చైనాలో మరో రికార్డు దిశగా ఫాస్టెస్ట్ బుల్లెట్ రైలు .. అదేంటంటే..!
హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల చరిత్రలో చైనా చరిత్ర సృష్టించింది. CR450 బుల్లెట్ రైలు 6 లక్షల కిలోమీటర్ల ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది భూమిని 15 సార్లు చుట్టిరావడంతో సమానం. గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు, ప్రపంచంలోనే మొదటిసారిగా పట్టాలపై "ఎగురు''తుంది.

గంటకు 400 కిలోమీటర్ల భీకర వేగంతో పరుగెడుతుంటే, ఆ రైలు పట్టాలను తాకకుండా గాలిలో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది! సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యం కాదు .. వేగంలో అన్ని రికార్డులను తిరగరాసిన ఒక నిజమైన సూపర్ రైలు అద్భుతం. ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ముందు, ట్రయల్ రన్ లో భాగంగా ఏకంగా 6 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. భూమి చుట్టూ ఒకటి రెండు సార్లు కాదు, ఏకంగా 15 సార్లు చుట్టి రావడానికి సమానమైన ప్రయాణం అది! కనురెప్పపాటులో వేగాన్ని పుంజుకునే ఈ రైలు, హైస్పీడ్ రైల్వే రూపురేఖలను పూర్తిగా మార్చేయనుంది.
చైనా కొత్త ‘CR450’ బుల్లెట్ రైలు రికార్డు
చైనాకు చెందిన అత్యాధునిక తరం ‘CR450’ బుల్లెట్ రైలు అత్యంత సవాల్‌తో కూడిన, ప్రమాదకరమైన ప్రీ-సర్వీస్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. పట్టాలపై గాలితో పోటీపడుతూ దూసుకెళ్లే ఈ రైలు, పరీక్షల్లో భాగంగా మొత్తం 6,00,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. ఈ 6 లక్షల కిలోమీటర్ల దూరం అనేది భూమి భూమధ్యరేఖను 15 సార్లు చుట్టుముట్టడంతో సమానం!
చైనా బుల్లెట్ రైళ్ల వేగాన్ని ప్రపంచమంతా గుర్తించింది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగ భిన్నంగా ఉంది. వేగం, భద్రతకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది కొత్త ‘CR450’ రైలు. ఇది గంటకు 400 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరిగెడుతుంది. అంటే, దీనిలో ప్రయాణిస్తున్నప్పుడు కనురెప్పపాటులో నగరాలు వెనక్కి వెళ్లిపోతాయి!
6 లక్షల కిలోమీటర్లు ఎందుకు?
అయితే, టన్నుల కొద్దీ బరువున్న రైలును గంటకు 400 కి.మీ. వేగంతో నడపడం మామూలు విషయం కాదు. ఇంజనీర్లు ఈ రైలును అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ—అంటే గడ్డకట్టే చలిలో, మండుతున్న ఎండలో, కురిసే భారీ వర్షంలో, అన్ని రకాల ట్రాక్‌లపై—మళ్లీ మళ్లీ పరీక్షించారు. ఈ 6 లక్షల కిలోమీటర్ల ట్రయల్స్ ఏమాత్రం చిన్న విషయం కాదు. గంటకు 400 కి.మీ. వేగంతో గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్తున్నప్పుడు రైలు బ్రేకులు, మోటార్, బాడీ, చక్రాలు ఎలా పనిచేస్తాయో పరిశీలించడమే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశం. ఎలాంటి చిన్న లోపం లేకుండా ఈ కఠినమైన పరీక్షలన్నింటినీ రైలు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే, ఇది ప్రయాణాలకు పూర్తిగా సురక్షితమైనదిగా ప్రకటించారు.
చైనా రైలు రైట్‌వర్క్ ప్రపంచంలోనే అతి పెద్దది. CR 450 రైలు బ్రేక్ వేసిన తర్వాత ఆగిపోవడానికి పట్టే దూరం చాలా తక్కువ ఉండేలా డిజైన్ చేశారు. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయాల్సి వచ్చినా సరే, ఎలాంటి పెద్ద కుదుపులు లేకుండా ఈ రైలు చాలా తక్కువ దూరంలోనే సురక్షితంగా ఆగిపోతుంది. కృత్రిమ మేధస్సుతో సెన్సార్లతో పని చేస్తుంది. ట్రాక్‌పై ఏదైనా చిన్న లోపం లేదా ప్రమాదం కనిపిస్తే, రైలు వెంటనే స్వయంచాలకంగా వేగాన్ని తగ్గించుకుంటుంది.
CR450 రైలు పట్టాలపైకి వస్తే, చైనాలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ దూరం గంటల నుంచి నిమిషాలకు తగ్గిపోతుంది. ఉదాహరణకు, చైనా రాజధాని బీజింగ్ నుండి షాంఘై మధ్య దూరం సుమారు 1,300 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి బుల్లెట్ రైలులో నాలుగు నుండి నాలుగున్నర గంటల సమయం పడుతోంది. అయితే, CR450 రాకతో ఈ ప్రయాణ సమయం కేవలం రెండున్నర నుండి మూడు గంటలకు తగ్గిపోనుంది!
రైలు లోపలి భాగం లగ్జరీ హోటల్‌ను తలపిస్తుంది. స్మార్ట్ స్క్రీన్‌లు, 5G ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కాళ్లను హాయిగా చాపుకోవడానికి తగినంత స్థలం కల్పించారు. అంతేకాకుండా, అధిక వేగంలో వెళ్తున్నప్పుడు కలిగే గాలి పీడనం వల్ల ప్రయాణికుల చెవుల్లో నొప్పి లేదా అసౌకర్యం కలగకుండా, బయటి దృశ్యాలు స్పష్టంగా కనిపించే ప్రత్యేక డిజైన్‌తో కిటికీలను రూపొందించారు.
జపాన్ యూరప్ ను వెనక్కు నెట్టి
చైనా తన రైల్వే నెట్‌వర్క్‌ను కేవలం 20 ఏళ్ల లో ప్రపంచం విస్తుపోయే స్థాయికి విస్తరించింది. ప్రస్తుతం చైనాలో 45,000 కిలోమీటర్లకు పైగా హైస్పీడ్ రైల్వే మార్గం ఉంది. ఇది ప్రపంచంలోని మొత్తం హైస్పీడ్ నెట్‌వర్క్‌లో సుమారు 70 శాతానికి సమానం. జపాన్ కు చెందిన ‘షింకాన్సెన్’ , ఫ్రాన్స్ ‘TGV’ బుల్లెట్ రైళ్లు ఇప్పటికీ గంటకు 300 నుండి 320 కి.మీ. వేగంతోనే నడుస్తున్నాయి. కాగా, చైనా మాత్రం ఇప్పుడు గంటకు ఏకంగా 400 కి.మీ. వేగంతో సాధారణ ప్రయాణికుల ప్రయాణానికి సిద్ధమైంది.
చరిత్ర సృష్టించిన 6 లక్షల కిలోమీటర్ల పరీక్ష
6 లక్షల కిలోమీటర్ల పరీక్షల ద్వారా, ‘CR450’ బుల్లెట్ రైలు తన సాటిలేని వేగాన్ని, భద్రతను మరోసారి నిరూపించింది. ఇప్పుడు చైనా రైల్వే అథారిటీ ఈ రైలును అధికారికంగా ఎప్పుడు ప్రారంభించనుందా అని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అద్భుత రైలు త్వరలోనే పట్టాలపైకి దూసుకెళ్తూ, చైనా చరిత్రలోనే కాకుండా ప్రపంచ రవాణా రంగంలోనూ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం ఖాయం!
ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే రైలును అభివృద్ధి చేసింది చైనా . దీంతో ఆ దేశం వేగంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. చైనా అభివృద్ధి చేసిన నయా బుల్లెట్ రైలు సీఆర్ 450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైలు గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ ట్రయల్ రన్‌లో సీఆర్ 450 రైలు గంటకు 453 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుని.. సరికొత్త చరిత్ర సృష్టించింది.
#China’s CR450 high-speed train, the world’s fastest bullet train, has set a new record by reaching a top speed of 453 km/h during testing. It can accelerate from a standstill to 350 km/h within 5 minutes! #highspeedtrain https://t.co/2AtK0LFZb1
— CCTV Asia Pacific (@CCTVAsiaPacific) October 22, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి