Corona New Variant: ప్రపంచం మీద కరోనా మరోసారి పగడ విప్పనుందా?.. WHO ఏం చెబుతోంది?..

Corona New Variant: ప్రపంచం మీద కరోనా మరోసారి పగడ విప్పనుందా? చైనాతో పాటు పలు దేశాల్లో కేసులు విజృంభించడం, భారత్‌లోనే స్వల్పంగా పెరగడం

Corona New Variant: ప్రపంచం మీద కరోనా మరోసారి పగడ విప్పనుందా?.. WHO ఏం చెబుతోంది?..
Corona
Shiva Prajapati

|

Apr 17, 2022 | 6:11 AM

Corona New Variant: ప్రపంచం మీద కరోనా మరోసారి పగడ విప్పనుందా? చైనాతో పాటు పలు దేశాల్లో కేసులు విజృంభించడం, భారత్‌లోనే స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్లు విరుచుకుపడుతూనే ఉన్నాయి. మరోవైపు పాండమిక్‌ ఎండమిక్‌కు ఇంకా చాలా దూరంగా ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

కరోనా మహమ్మారికి ఇప్పట్లో అంతం లేదా? దాదాపు ముగింపు దశకు వచ్చిందని భావిస్తున్న కొవిడ్‌, పలు దేశాల్లో తిరిగి పడగ విప్పడం చూస్తుంటే మరోసారి భయాందోళనలు సృష్టిస్తోంది. పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగడంతో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. రూపు మార్చుకుంటున్న కొత్త వేరియంట్లతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్‌లోనూ రకరకాల సబ్‌ వేరియంట్లు విజృంభిస్తున్నాయి.

కరోనా పుట్టిల్లు చైనా అందరికన్నా ముందు కోలుకున్నట్లు ప్రకటించినా, ఇప్పుడు మహమ్మారి మరోసారి విజృంభించడంతో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. షాంగైతో పాటు 87 నగరాల్లో రోజుల తరబడి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దేశ జనాభాలో 40 కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధాని షాంగైలో ఆంక్షల తీవ్రత కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడటంతో ఆహారం, మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజలు ఆకలి కేకలతో తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే శిక్షలను కఠినతరం చేస్తామని అధికారులు హెచ్చిరస్తున్నా ఎవరూ లెక్క చేయడంలేదు.

మరోవైపు హాంకాంగ్‌, దక్షిణ కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తాజా 6,99,300 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,270 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండున్నరేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 కోట్ల 40 లక్షల మంది కరోనా బారిన పడితే.. 62 లక్షల మందికిపైగా మరణించారు.

కరనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అప్రమత్తం చేసింది. పాండమిక్‌ ఎండమిక్‌గా మారేందుకు చాలా దూరంలో ఉన్నామని పేర్కొంది. ప్రపంచం ఇప్పట్లో ఎండెమిక్‌ దశకు చేరుకుంటుందని భావించడం లేదని తెలిపింది. ప్రతివారం మరోసారి లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని WHO గుర్తు చేసింది. కొత్త వేరియంట్ల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక భారత్‌లో కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిందని భావించినా కొత్తగా ముంబై, గుజరాత్‌లో XE వేరియంట్‌ కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. మరోవైపు ఢిల్లీలో మరోసారి కొవిడ్‌ చేసులు విజృంభిస్తుననాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 975 కొత్త కేసులు నమోదు కాగా, ఒక్క ఢిల్లీలోనే 366 కేసులున్నాయి. అక్కడ అక్కడ పాజిటివిటీ రేటు 3.95 శాతానికి చేరింది. ఫిబ్రవరి 3 తర్వాత ఇదే అత్యధికం అని చెబుతున్నారు.. దేశంలో తాజాగా నలుగురు కరోనాతో మరణించారు. పరిస్థితులు తీవ్రంగా మారకుండా జాగ్రత్త పడాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలనూ హెచ్చరించింది.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu