Nostradamus Astrology: నోస్ట్రడామస్ భవిష్యవాణి.. మూడో ప్రపంచ యుద్ధంపై హాట్ డిస్కర్షన్..!
Nostradamus Astrology: భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో భూలోకంలో సంభవించే అనేక పరిణామాల గురించి ముందే ఊహించి రాసిందే భవిష్యవాణి..!
Nostradamus Astrology: భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో భూలోకంలో సంభవించే అనేక పరిణామాల గురించి ముందే ఊహించి రాసిందే భవిష్యవాణి..! తాళపత్రాలపై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రచించారు. అయనలాగే.. భవిష్యత్తును తనదైన శైలిలో అంచనా వేశారు నోస్ట్రడామస్. ఇప్పటి వరకూ.. ఒక్కటీ తప్పుగా చెప్పని తత్వవేత్తగా నోస్ట్రడామస్‌కు పేరుంది. భవిష్యత్తుపై ఏం చెప్పారో.. అది ఖచ్చితంగా జరిగింది. ఇక థర్డ్ వరల్డ్ వార్‌పై కూడా నోస్ట్రడామస్ భవిష్యవాణి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నోస్ట్రడామస్ మూడో ప్రపంచ యుద్ధం జోస్యం హాట్ టాపిక్‌గా మారింది.
1945 ఆగస్టు 6, 9 హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు. 1933 జనవరి 30 నుంచి 1945 ఏప్రిల్ 30 వరకు హిట్లర్ హింస, రెండో ప్రపంచ యుద్ధం. 2001 సెప్టెంబర్ 11 అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత. 2020.. అంటు రోగాలు విస్తరించి.. వినాశనం వైపు ప్రపంచం. 2021 అంతుచిక్కని వ్యాధులు, కరువు, ఉల్కలు, బయోవెపన్స్. ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించిన.. మహావిషాద ఘటనలు ఇవి..! ఆకస్మాత్తుగా తరుముకొచ్చిన ఈ వినాశనాలను ముందే ఊహిస్తే..! రాబోయే ముప్పును ముందే చెప్పగలిగితే..! ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యవాణి తెలిస్తే..! అవును.. ఈ ఆలోచనే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మశక్యంగా లేకపోయినా.. ఇప్పటి వరకూ జరిగిన ఈ ఘటనలన్నీ ముందుగా నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో చెప్పినవేనట!
నోస్ట్రడామస్! ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంను భారత్‌లో ఎలా విశ్వసిస్తారో 16వ శతాబ్దపు ఈ ఫ్రెంచ్ భవిష్యకారుడు నోస్ట్రడామస్ చెప్పిన దానిని కూడా ప్రపంచ వ్యాప్తంగా కొందరు నమ్ముతారు. జర్మనీ నియంత ఎడాల్ఫ్ హిట్లర్ అరాచకం నుంచి.. అణుబాంబుల దాడులు.. రెండో ప్రపంచ యుద్ధం, అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత.. దేశాధ్యక్షుల మరణాలు.. ఇంకా మరెన్నో సంఘటనలు.. చివరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ గురించి కూడా… నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో చెప్పారట!
ఈ కాలజ్ఞానుల భవిష్యవాణులు, జోస్యాలను ఒక్క సెకన్ పక్కనపెడితే..!! ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో.. థర్డ్ వరల్డ్ వార్‌పై వరల్డ్ వైడ్‌గా హైటెన్షన్ క్రియేట్ అయివుంది. ఈ మూడో ప్రపంచ యుద్ధంపై కూడా.. ఫ్రెంచ్ భవిష్యకారుడు నోస్ట్రడామస్ చెప్పిన జోస్యం హాట్ టాపిక్‌గా మారింది.
నోస్ట్రడామస్ చెప్పింది జరుగుతుంది!.. నోస్ట్రడామస్ భవిష్యత్తుపై ఏం చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుందని కొందరు నమ్ముతారు. 1503 డిసెంబర్‌లో ఫ్రాన్స్ దక్షిణాన సెయింట్ రెమీ డీ ప్రావిన్స్‌లో పుట్టిన నోస్ట్రడామస్.. 1547 నుంచి భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు. ఆయన కవితల రూపంలో జోస్యాలు చెప్పేవాడు. 21వ శతాబ్దంలో ఏం జరగబోతుందన్నదనే దానిపై 400 ఏళ్ల కిందటే నోస్ట్రడామస్ ఊహించాడు. లెస్ ప్రాఫటీస్ పేరుతో గ్రంథాన్ని రచించి.. అందులో 942 కవితాత్మక జోస్యాలను పొందుపరించాడు. అందులో ఆయన చెప్పినవన్నీ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విశ్వసిస్తున్నారు. ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తూ.. భవిష్యత్తును పక్కగా అంచనా వేశాడు నోస్ట్రడామస్. నోస్ట్రడామస్ మొత్తం 6,338 అంచనాలు వేశాడు. వాటిలో చాలా వరకూ ఇప్పటికే జరిగాయి. క్రీస్తు శకం 3797 వరకూ ఆయన అంచనా వేశాడు. అయితే.. భవిష్యత్తును ముందే ఎలా ఊహించగలిగాడన్నది ఇప్పటివరకూ తేలలేదు. ఇక ఇప్పటివరకూ ఒక్కటీ తప్పుగా చెప్పని తత్వవేత్తగా పేరున్న నోస్ట్రడామస్.. మూడో ప్రపంచ యుద్ధంపై కూడా కొన్ని జోస్యాలు చెప్పారు. 2023లో థర్డ్ వరల్డ్ వార్ తప్పదని ముందే భవిష్యవాణి చెప్పారు నోస్ట్రడామస్. ఈ యుద్ధం ఏడు నెలల పాటు సాగుతుందన్నారు.
నోస్ట్రడామస్ పుస్తకంలో తెలిపిన మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. 2022లో ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో ధరలు పెరుగుతాయని జోస్యం చెప్పారు. అలానే.. ఆకలి చావుల ఘటనలు విపరీతంగా సంభవిస్తాయని. చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు పతనం చెంది.. ప్రజలు ఆహారం దొరక్క మరణిస్తారని భవిష్యవాణి చెప్పారు నోస్ట్రడామస్. నోస్ట్రడామస్ అంచనాల్లో కొన్ని నిజం అయ్యాయి. ఇప్పుడు ధరాఘాతంపై చెప్పినవి కూడా జరుగుతున్నాయని అంటున్నారు ఆయన ఫాలోవర్స్. ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్‌తో.. 140 దేశాల్లో ధరలు పెరిగాయని, బలహీన దేశాలను ఆర్థిక సంక్షోభాల్లోకి నెడుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ధరలు, శ్రీలంకలోని ఆర్థిక సంక్షోభాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. వచ్చే ఏడాది థర్డ్ వరల్డ్ వార్ సైరన్ మోగే అవకాశం కూడా ఉందంటున్నారు నోస్ట్రడామస్ ఫాలోవర్స్.
భవిష్యత్తుపై.. క్యాలెండర్ లెక్కలు చెప్పినా, నోస్ట్రడామస్ చెప్పినా, కాలజ్ఞానులు చెప్పినా.. ఇంకా ఎవరెన్ని చెప్పినా.. వారి జోస్యాలలో.. అస్పష్టతే ఎక్కువ.. సూటిగా ఉండవు.. మర్మగర్భంగా ఉంటాయి. వీటిని కొంతమంది మూఢంగా నమ్ముతున్నారు. ఏదిఏమైనా.. క్యాలెండర్ల లెక్కలు, జోస్యాలతో కాలయాపన చేయకుండా.. భవిష్యత్తును పాజిటివ్‌గా తీసుకోని ముందుకు అడుగువేయాలి.
Also read:
Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..
Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!