Pakistan PM Letter: ప్రధాని మోదీ లేఖకు సమాధానం ఇచ్చిన పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్.. ఏమన్నారంటే..?

పాకిస్తాన్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్ శనివారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖకు సమాధానం పంపారు.

Pakistan PM Letter: ప్రధాని మోదీ లేఖకు సమాధానం ఇచ్చిన పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్.. ఏమన్నారంటే..?
Pakpm Letter To Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 16, 2022 | 6:53 PM

Pakistan PM Letter to Modi: పాకిస్తాన్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్(Shehbaz Sharif) శనివారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) లేఖకు సమాధానం పంపారు. భారత్ పాక్ రెండు దేశాల మధ్య శాంతి సహకారాన్ని పెంపొందించుకోవాలని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ ఉద్ఘాటించారు. దీంతో పాటు, రెండు దేశాల మధ్య సామాజిక, ఆర్థిక అభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందన ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

పాకిస్తాన్ ప్రధానిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు రోజుల క్రితం ఆయనకు ప్రధాని మోదీ లేఖ రాశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. షాబాజ్ షరీఫ్‌కు ఆయన చేసిన ట్వీట్‌లో శుభాకాంక్షలు కాకుండా, చర్చల కోసం ఉగ్రవాద రహిత వాతావరణాన్ని సృష్టించడం గురించి ఈ లేఖలో ప్రధాని ప్రస్తావించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారతదేశం కూడా పేదరికంతో సహా ఇతర సమస్యలపై మాట్లాడాలని, కలిసి వ్యవహరించాలని కోరుకుంటోందని ప్రధాని లేఖ రాశారు.

ఇమ్రాన్ ఖాన్ తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినేత షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రి అయ్యారు. షాబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. ఇమ్రాన్ ఖాన్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన మొదటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కావడం విశేషం. ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగస్టు 18న పాకిస్తాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతను 10 ఏప్రిల్ 2022 వరకు 1,332 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. మూడు సంవత్సరాల ఏడు నెలల 23 రోజుల పాటు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగారు.

Read Also…  Uttar Pradesh: ప్రయాగ్‌రాజ్‌లో ఘాతుకం.. ముగ్గురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణహత్య

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!