AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: ప్రయాగ్‌రాజ్‌లో ఘాతుకం.. ముగ్గురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణహత్య

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల హత్య తీవ్ర కలకలం రేపింది. ఖగల్‌పుర్ ప్రాంతానికి చెందిన ఐదుగురిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

Uttar Pradesh: ప్రయాగ్‌రాజ్‌లో ఘాతుకం.. ముగ్గురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణహత్య
Family Murdered
Balaraju Goud
|

Updated on: Apr 16, 2022 | 6:26 PM

Share

UP Crime News: ఉత్తర్ ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల హత్య తీవ్ర కలకలం రేపింది. ఖగల్‌పుర్ ప్రాంతానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి సహా ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్పందించిన సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌.. అధికార బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. రెండో విడత బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ నేరాల్లో మునిగిపోయిందంటూ ఆయన ఆరోపించారు.

ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన వారి హత్య వార్తతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ సంచలన హత్య నవాబ్‌గంజ్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో భార్యాభర్తలు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం ప్రారంభించారు. మృతుల్లో భర్త రాహుల్ తివారీ (42), భార్య ప్రీతి తివారీ (38), ముగ్గురు పిల్లలు మహి 12, పిహు 8 సంవత్సరాలు, కోతు 5 సంవత్సరాలు ఉన్నారు. మృతుడి కుటుంబం కౌశాంబిలోని సిరతుకు చెందినదని తెలిపారు. గత కొంతకాలంగా రాహుల్ తివారీ కుటుంబం ప్రయాగ్‌రాజ్‌లోని నవాబ్‌గంజ్‌లోని ఖగల్‌పూర్ గ్రామంలో అద్దెకు నివసిస్తోంది. హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు.

ఒకే గదిలో భర్త, భార్య, పిల్లల మృతదేహం లభ్యం కావడంతో ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గదిలో ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భార్యతో పాటు ముగ్గురు పిల్లల మృతదేహాలు మంచంపై పడి ఉన్న స్థితిలో పడి ఉన్నాయి. కాగా భర్త మృతదేహం ఉరివేసుకుని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మొత్తం హత్యను ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం నిందితులు చేసి ఉంటారనే పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ మొత్తం ఘటనను పూర్తి చేసి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఐదుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనేది మొత్తం విచారణ తర్వాత మాత్రమే స్పష్టమవుతుందని స్థానిక పోలీసులు తెలిపారు.

కాగా, ఈ ఘటనకు ఉపయోగించిన గడ్డపారను కూడా పోలీసులు ఇంటి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారులతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టాయి. రెండేళ్ల క్రితం నవాబ్‌గంజ్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని పదునైన ఆయుధాలతో గొంతు కోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఒకే ప్రాంతంలో హత్య చేయడంపై ఆ ప్రాంతంలో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Read Also….  Sabita Indrareddy: కాన్వాయ్ అపి కరుణ చూపిన సబితమ్మ.. కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులకు చేయూత..