Sabita Indrareddy: కాన్వాయ్ అపి కరుణ చూపిన సబితమ్మ.. కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులకు చేయూత..

కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులకు చేయూత అందించారు. వెంటనే విద్యార్థులకు షూ జతలు, సాక్స్ ఇప్పించి గొప్ప మనసు చాటుకున్న మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి.

Sabita Indrareddy: కాన్వాయ్ అపి కరుణ చూపిన సబితమ్మ..  కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులకు చేయూత..
Sabita Indra Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 16, 2022 | 6:01 PM

Minister Sabita Indrareddy: మంత్రిగా తన కార్యకలాపాల్లో బిజీబిజీగా గడిపే తెలంగాణ(Telangana) విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఏదైనా అపద వస్తే.. వెంటనే స్పందిస్తారు. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తారు. ఇదే క్రమంలో తాజాగా కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులకు చేయూత అందించారు. వెంటనే విద్యార్థులకు షూ జతలు, సాక్స్ ఇప్పించి గొప్ప మనసు చాటుకున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

రంగారెడ్డి జిల్లాలో ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా వెళుతున్న విద్యార్థులను చూసి కాన్వాయ్ అపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వారి వివరాలు తెలుసుకున్నారు. శనివారంనాడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మామిడిపల్లి మీదుగా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే వారికి తన దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించారు. చాక్లెట్లు, మంచి నీరు అందించారు. అలాగే వారికి చెప్పులు, షూస్, సాక్స్ కొనుక్కునేందుకు చేయూత అందిస్తామని చెప్పారు. వెంటనే అక్కడే ఉన్న స్థానిక నాయకుడికి ఫోన్ చేసి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దాంతో వెంటనే ఆయన వారికి షూ లు, సాక్స్ అందించారు. అనంతరం విద్యార్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలావుంటే, గతంలోనూ తన మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి సబితా. వికారాబాద్ జిల్లా పర్యటన ముగించుకుని మొయినబాద్ వెళ్తుండగా ముడిమ్యాల క్యాసారం గేట్ల మధ్యలో రోడ్డు ప్రమాదం జరగటంతో కాన్వాయ్ అపి మంత్రి, ఎమ్మెల్యేలు పోలీస్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే క్షతగాత్రులను ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి, ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

Read Also…  Andhra Pradesh: ఏపీ కొత్తమంత్రులకు ఆరంభంలోనే అపశృతులు.. పోలీసుల అత్యుత్సహానికి ఏడు నెలల చిన్నారి బలి!