AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hijab: ఇరాన్‌లో మిన్నంటుతోన్న హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు.. అణిచి చేస్తున్న ప్రభుత్వం.. అసలేంటీ వివాదం..

Hijab: హిజాబ్‌ రేపిన చిచ్చుతో ఇరాన్‌లో ఆందోళనలు ఆకాశాన్ని అంటున్నాయి. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న కారణంతో మాసా అమీని అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే కస్టడీలో..

Hijab: ఇరాన్‌లో మిన్నంటుతోన్న హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు.. అణిచి చేస్తున్న ప్రభుత్వం.. అసలేంటీ వివాదం..
Anti Hijab Protests
Narender Vaitla
|

Updated on: Sep 23, 2022 | 1:20 PM

Share

Hijab: హిజాబ్‌ రేపిన చిచ్చుతో ఇరాన్‌లో ఆందోళనలు ఆకాశాన్ని అంటున్నాయి. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న కారణంతో మాసా అమీని అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే కస్టడీలో తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నిరసనలకు దారి తీసింది. దేశంలోని యువతులంతా ఒకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వేదికగా వీడియోలు పోస్ట్‌ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరాన్‌లో మహిళల ఆందోళనలు రోజు రోజుకి మిన్నంటుతున్నాయి.

ఇరాన్‌లో మోరల్‌ పోలీసింగ్‌పై మహిళా లోకం తిరగబడింది. హిజాబ్‌లను తగలబెడుతూ ఏం చేస్తారో చేసుకోండి అంటూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. మహిళల నిరసననకు అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించారు. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలనుపయోగించి ఆందోళనలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్‌లో భద్రతా బలగాలు జరిపిన అణిచివేతలో ఇప్పటివరకూ కనీసం.. 31 మంది పౌరులు మరణించారని వార్తా సంస్థలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉధృతమైన నెలకొన్ని పరిస్థితులను అరికట్టడానికి ఇరాన్ గురువారం టెహ్రాన్, కుర్దిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేసింది.

అసలు ఏంటీ షరియా..?

షరియా అంటే ఇస్లాం న్యాయవ్యవస్థ. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని అంశాలను ఇందులో పొందుపరిచారు. మత పెద్దలు చేసిన ఫత్వాల (ఆదేశాలు) ఆధారంగా దీనిని రూపొందించారు. నీటి వద్దకు వెళ్లే స్పష్టమైన, నిర్దిష్టమైన మార్గమే’ షరియా అని నమ్ముతారు. నిజానికి ఖురాన్‌లో మహిళల వస్త్రధారణపై ప్రత్యేకంగా నిబంధనలేమీ పేర్కొనలేదు. అయితే ముస్లింల మతపరమైన జీవితాలను పరిపాలించే నియమాలతో మతపెద్దలు రూపొందించిందే ఈ ‘షరియా’. ముస్లింలు తమ జీవితంలో వేసే ప్రతి అడుగునీ, ఆచరించే ప్రతి పనినీ ఈ చట్టంలో పొందుపరిచారు. వారి జీవన విధానం అంతా వారు పొద్దున్న లేచి చేసే ప్రార్ధనల నుంచీ పర్వదినాల్లో పాటించే ఉపవాసాలు, పేదలకు చేసే దానాల వరకు అన్నీ ఈ చట్టానికి లోబడే ఉంటాయి.

హిజాబ్‌ ధరించని వారిని నగ్నంగా భావించేవారు..

నిజానికి ఇస్లామిక్ రిపబ్లిక్ పునాది ఏర్పడటానికి ముందు, ఇరానియన్ మహిళలు ముసుగు ధరించడం తప్పనిసరి కాదు. 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ లో షరియా చట్టం అమల్లోకి వచ్చింది. 1979 మార్చి 7న ఇస్లామిక్ విప్లవ నాయకుడు అయతొల్లా రుహోల్లా ఖొమేనీ ఒక ఆదేశాన్ని జారీ చేశారు. కార్యాలయాల్లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరని, అలా ధరించినవారిని “నగ్నంగా” పరిగణించాలని ఆదేశించారు.

ఆయన ప్రసంగాన్ని చాలామంది ఇస్లామిక్ విప్లవకారులు ఒక ఆజ్ఞగా స్వీకరించారు. బలవంతంగానైనా మహిళలు హిజాబ్ ధరించేలా చూడాలని భావించారు. అయతొల్లా ఖొమేనీ ఆజ్ఞ ఇచ్చేసినప్పటికీ.. మహిళల విషయంలో “సరైన” వస్త్రధారణ అంటే ఏమిటో నిర్ణయించుకునేందుకు అధికారులకు కొంత సమయం పట్టింది. 1981 నాటికి, మహిళలు, బాలికలు నిరాడంబరమైన “ఇస్లామిక్” దుస్తులు ధరించాలని చట్టబద్ధం చేశారు. అంటే ఒళ్లంతా కప్పేలా బుర్ఖా, తలపై హిజాబ్, చేతులు కనబడకుండా ఓవర్‌కోట్ తప్పనిసరిగా వేసుకోవాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..