China: జాక్‌పాట్ కొట్టేసిన చైనా.. మరో 200 టన్నుల బంగారు నిల్వలు లభ్యం

|

May 21, 2023 | 5:00 AM

ఇప్పటికే అభివృద్ధి మార్గంలో దూసుకుపోతున్న చైనాకు దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు దొరికింది. అక్కడ ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లైజాలో ఉన్న జిలింగ్‌ గోల్డ్‌ మైన్‌ సామర్థ్యం 580 టన్నులకు చేరింది.

China: జాక్‌పాట్ కొట్టేసిన చైనా.. మరో 200 టన్నుల బంగారు నిల్వలు లభ్యం
Gold
Follow us on

ఇప్పటికే అభివృద్ధి మార్గంలో దూసుకుపోతున్న చైనాకు దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు దొరికింది. అక్కడ ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లైజాలో ఉన్న జిలింగ్‌ గోల్డ్‌ మైన్‌ సామర్థ్యం 580 టన్నులకు చేరింది. అయితే బంగారం ఉత్పత్తిలో ఇది చైనాలోనే అతిపెద్ద బంగారు గనిగా అవతరించనున్నట్టు ఓ మీడియా సంస్థ ప్రకటించింది.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా మారనుందని పేర్కొంది. అయితే ఈ గనిలో అదనంగా 200 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్టు జాతీయ సహజ వనరుల శాఖ ఇటీవల కనుగొంది. ఈ గని బంగారం ఉత్పత్తి సామర్థ్యం 580 టన్నులకు చేరడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థకు 200 బిలియన్‌ యువాన్‌లను సమకూర్చనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో తాము 550 టన్నుల బంగారం ఉన్న గనిని కనుగొన్నట్టు జిలిన్‌ గోల్డ్‌మైన్‌ యాజమాన్యం అయిన జిలిషాన్‌డాంగ్‌ గ్రూప్‌ కంపెనీ 2017లోనే ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..