Viral Video: బాబోయ్ బాంబు.. లైవ్ మధ్యలో నుంచి పరుగులు తీసిన యాంకర్..
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ఇరాన్‌పై విరుచుకపడిన ఇజ్రాయెల్ ఇప్పుడు సిరియాను లక్ష్యంగా చేసుకుంది. అక్కడి డ్రూజ్ కమ్యూనిటికీ మద్ధతుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బాంబు దాడులతో యాంకర్ లైవ్ మధ్యలో నుంచి పరగెత్తడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ఇరాన్ పై దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు సిరియాపై బాంబు దాడులకు పాల్పడుతోంది. సిరియాలోని ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో అక్కడ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇజ్రాయెల్ ఇటీవల దక్షిణ సిరియాలోని సువైదా ఘర్షణల్లో జోక్యం చేసుకుంది. ఇక్కడ మైనారిటీ డ్రూజ్ కమ్యూనిటీకి – ఇతర సాయుధ సమూహాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో 250 మంది వరకు మరణించారు. అయితే డ్రూజ్ కమ్యూనిటీని కాపాడతామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయం అసాధారణ చర్య అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లో డ్రూజ్ కమ్యూనిటీ విస్తరించి ఉంది. సిరియాలో ప్రభుత్వం మారడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో స్వయం పాలన డిమాండ్ చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. దీంతో డ్రూజ్ కమ్యూనిటీకి అండగా ఇజ్రాయెల్ ఎంటర్ అయ్యింది.
డెమాస్కస్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడుతోంది. రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఓ టీవి ఆఫీసు సమీపంలోనే ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. దీంతో లైవ్‌లో న్యూస్ చదువుతున్న యాంకర్.. మధ్యలోంచి భయంతో పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో చేశారు. డమాస్కస్‌లో హెచ్చరికలు ముగిశాయి. ఇప్పుడు బాధాకరమైన దాడులు స్టార్ట్ అవుతాయిని అన్నారు. ‘‘ప్రధాన మంత్రి నెతన్యాహు, నేను ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. డ్రూజ్ కమ్యూనిటీకి అండగా ఉండాలని నిశ్చయించుకున్నాం. డ్రూజ్ కమ్యూనిటీ ఒంటరి కాదు. వారికి మేం ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అన్నారు. గత మూడు రోజుల నుంచి ఇజ్రాయెల్ సిరియాపై దాడులు చేస్తోంది.
החלו המכות הכואבות pic.twitter.com/1kJFFXoiua
— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) July 16, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
