America Corona cases: అమెరికాను వణికిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 2 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు
America Corona cases: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య ...
America Corona cases: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక గడిచిన 24 గంటల్లో దాదాపు 2.9 లక్షల కొత్త కేసులు నమోదు కావడం మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. జూన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో కొత్తగా మరో 3676 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు అమెరికాలో 21.8 మిలియన్ల పాజిటివ్ కేసులు, 3.68 లక్షల మరణాలు సంభవించాయి.
అయితే కరోనాను అరికట్టేందుకు అక్కడి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను గత ఏడాది డిసెంబర్ లో చేపట్టింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు నూతన అధ్యక్షుడు జో బైడెన్ అధికారి ప్రతినిధి తెలిపారు. అమెరికాలో ఇప్పటి వరకు రవాణా చేసిన 22 లక్షల డోసుల్లో 6.6 మిలియన్ల మందికి తొలి వ్యాక్సిన్ ఇచ్చినట్లు అంటువ్యాధుల నివారణ కేంద్రం తెలిపింది. ఇక అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో అధికారులను కలవరపెడుతోంది. మృతుల అంత్యక్రియలకు శ్మశాన వాటికల్లోనూ స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.
అలా కరోనా కట్టడికి అన్ని విధాలుగా చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. లాక్‌డౌన్ విధిస్తూ, అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి.