భారత్ మిస్సైల్స్ దాడికి జడుసుకున్న పాక్.. దెబ్బకు ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయం మార్పు..!

ఆపరేషన్‌ సింధూర్‌ దెబ్బతో నిద్రలోనే ఉలిక్కిపడుతోంది పాకిస్తాన్‌. తమ ఆర్మీ బేస్‌లపై భారత్ మిస్సైల్స్ దూసుకొస్తున్నట్లు పీడకలలు వస్తుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్షిపణి దాడి తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయాన్ని రావల్పిండిలోని చక్లాలా నుండి ఇస్లామాబాద్‌కు మార్చాలన్న ఆలోచనలో ఉంది పాక్ రక్షణ శాఖ.

భారత్ మిస్సైల్స్ దాడికి జడుసుకున్న పాక్.. దెబ్బకు ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయం మార్పు..!
Pakistan Army General Headquarters

Updated on: May 18, 2025 | 8:08 AM

ఆపరేషన్‌ సింధూర్‌ దెబ్బతో నిద్రలోనే ఉలిక్కిపడుతోంది పాకిస్తాన్‌. తమ ఆర్మీ బేస్‌లపై భారత్ మిస్సైల్స్ దూసుకొస్తున్నట్లు పీడకలలు వస్తుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్షిపణి దాడి తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయాన్ని రావల్పిండిలోని చక్లాలా నుండి ఇస్లామాబాద్‌కు మార్చాలన్న ఆలోచనలో ఉంది పాక్ రక్షణ శాఖ.

ఆపరేషన్‌ సింధూర్‌ దెబ్బకు పాకిస్తాన్‌ వణికిపోతోంది. 25 నిమిషాల్లో 24 మిస్సైల్స్ పంపి వణుకు పుట్టించిన భారత వైమానిక దాడులు పాక్ ఆర్మీకి ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీగా ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా మిస్సైల్స్ పనితీరుకు వాస్తవ సాక్ష్యంగా కూడా నిలవటంతో పాక్ జాగ్రత్త పడుతోంది. భారత క్షిపణి దాడి తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయాన్ని రావల్పిండిలోని చక్లాలా నుండి ఇస్లామాబాద్‌కు మార్చాలన్న ఆలోచనలో ఉంది పాక్ రక్షణ శాఖ.

రావల్పిండి భారత్ మిస్సైళ్లకు చాలా అనువుగా ఉంది. అందుకే ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అక్కడ మిస్సైళ్లు పడ్డాయి. అక్కడి నుంచి డ్రోన్లను భారత్‌పైకి పంపేందుకు ఆదేశాలు ఇస్తున్న ఆర్మీ చీఫ్ దెబ్బకు బంకర్‌లోకి పారిపోయాడు. మూడు రోజుల పాటు బయటకు రాలేదు. అక్కడ ఇంధన ట్రక్కులతో పాటు, గోదాము పైకప్పులు ధ్వంసం కావటంతో పాక్ అలర్ట్ అయ్యింది. ఇస్లామాబాద్ అయితే..కాస్త సేఫ్‌గా ఉంటుందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్.. పాక్ ఆర్మీ వ్యూహాత్మక ప్లానింగ్ డివిజెన్ హెచ్ క్వార్టర్స్ కి చేరువలో ఉంది. అక్కడి నుంచే పాక్ తన అణ్వాయుధాల నిర్వహణను చేపడుతోంది. ప్రస్తుతం పాక్ వద్ద దేశవ్యాప్తంగా 170 వరకు అణ్వాయుధాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న బ్రమ్మోస్ క్షిపణులను ఉపయోగించి పాకిస్థాన్ లోని దాదాపు 11 ఎయిర్ బేస్ లను టార్గెట్ చేయవచ్చు. ఇది పాకిస్థాన్ కి ఆందోళన కలిగిస్తున్న అతిపెద్ద అంశం. అందుకే పాక్ తన ఆర్మీ హెడ్ క్వార్టర్ మార్పు విషయంలో వేగంగా ముందుకు సాగుతోందని తెలుస్తోంది. మరోవైపు బలూచిస్థాన్ లిబరేషన్ ప్రకటనతో పాక్ రక్షణ విషయంలో మరింతగా అప్రమత్తతను పాటించాలని కూడా భావిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..