AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: ఈ ఏడాది ఏలియన్స్‌ను కలుస్తాం..! బాబా వంగా భవిష్యవాణి ప్రకారం 2025లో జరిగే అద్భుతాలు ఇవే..

2025 నాటికి వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని బాబా వంగా అంచనా వేశారు. ముఖ్యంగా ప్రయోగశాలలో తయారు చేసిన అవయవాలు మనుషులకు అమర్చడం, క్యాన్సర్ వంటి వ్యాధులకు అద్భుతమైన చికిత్సలు వస్తాయని అన్నారు. వీటితో పాటు ఏలియన్స్‌ గురించి కూడా ఆసక్తికర జోష్యం చెప్పారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Baba Vanga: ఈ ఏడాది ఏలియన్స్‌ను కలుస్తాం..! బాబా వంగా భవిష్యవాణి ప్రకారం 2025లో జరిగే అద్భుతాలు ఇవే..
Baba Vanga
SN Pasha
|

Updated on: Feb 20, 2025 | 1:13 PM

Share

బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగా ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఆమె చెప్పిన విషయాలు చాలా సందర్భాలలో నిజంగా జరిగాయి. ఆమె చెప్పింది చెప్పినట్లు జరుగుతుండటంతో అనేక మంది ధనవంతులు, రాజకీయ నేతలు కూడా బాబా వంగా వద్దకు వెళ్లి జోతిష్యం చెప్పించుకునే వారు. ఆమె ఏ విషయం మాట్లాడినా అది ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారేంది. అయితే ఆమె బతికి ఉన్న సమయంలో 2025లో జరగబోయే పలు విషయాలు గురించి భవిష్యవాణి పలికారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాబా వంగా చెప్పినట్లే జరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అసలింతకీ ఆమె 2025లో ఏం జరుగుతుందని చెప్పిందో ఇప్పుడో ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

యూరప్‌లో విధ్వంసం.. 2025లో యూరప్ తీవ్రమైన అంతర్గత సంఘర్షణను ఎదుర్కోవలసి వస్తుందని, దీని వలన జనాభా తగ్గుదల, ప్రాంతీయ విధ్వంసం సంభవిస్తుందని బాబా వంగా అంచనా వేశారు. వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఇది అంతర్గత కలహాలు, దాని దీర్ఘకాలిక పరిణామాల గురించి ఆందోళనలను లేవనెత్తుతుంది.

సైన్స్, వైద్య రంగం గురించి.. బాబా వంగా చెప్పిన ప్రకారం 2025 నాటికి వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా ప్రయోగశాలలో తయారు చేసిన అవయవాలు మనుషులకు అమర్చడం, క్యాన్సర్ వంటి వ్యాధులకు అద్భుతమైన చికిత్సలు వస్తాయని అన్నారు. ఈ పురోగతులు ఆరోగ్య సంరక్షణను మారుస్తాయని, మనిషి జీవితకాలాన్ని పొడిగిస్తాయని, లక్షలాది మంది జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి అంచనా వేశారు.

గ్రహాంతరవాసులతో పరిచయం.. 2025లో ఏలియన్స్‌తో మానవుల సంబంధాలు ఏర్పడటం, లేదా ఏలియన్స్‌ ఉన్నారనే విషయాన్ని నిర్ధారించుకోవడం వంటి సంచలన సంఘటనలు చోటు చేసుకుంటాయని బాబా వంగా చెప్పారు.

సంభవించే విపత్తులు.. 2025లో విపత్కర సంఘటనల పరంపర ప్రారంభం కావచ్చని బాబా వంగా అంచనా వేశారు. పూర్తి మానవ వినాశనాన్ని సూచించకపోయినా, ఈ కాలం ప్రపంచ మార్పులకు దారితీసే కష్టాలను సూచిస్తుందని పేర్కొన్నారు. అయితే తాజాగా ఓ గ్రహశకలం భూమిని ఢీ కొనే అవకాశం ఉందనే విషయం తెలియడంతో ఇది కూడా ఆమె చెప్పిన దానిలో భాగమని కూడా చాలా మంది నమ్ముతున్నారు.