AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephant Video: దురద వస్తే ఇలా మాత్రం చేయకండి.. నవ్వు తెప్పిస్తున్న ఏనుగు వీడియో..

ప్రకృతి చాలా అందమైనది. పక్షుల కిలకిలరావాలు, జంతువుల అరుపులు, పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఇదంతా ఓ వైపు.. కానీ మరో వైపు.. ప్రకృతి చాలా దుర్మార్గంగా ఉంటుంది. అడవిలో ఉండే..

Elephant Video: దురద వస్తే ఇలా మాత్రం చేయకండి.. నవ్వు తెప్పిస్తున్న ఏనుగు వీడియో..
Elephant Video
Ganesh Mudavath
|

Updated on: Nov 04, 2022 | 8:57 PM

Share

ప్రకృతి చాలా అందమైనది. పక్షుల కిలకిలరావాలు, జంతువుల అరుపులు, పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఇదంతా ఓ వైపు.. కానీ మరో వైపు.. ప్రకృతి చాలా దుర్మార్గంగా ఉంటుంది. అడవిలో ఉండే జంతువుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. బతుకు కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి. అడవిలో నివాసముండే జంతువుల్లో సింహాలు చాలా బలం కలిగినవిగా పేరు తెచ్చుకున్నాయి. అయితే ఈ విషయంలో ఏనుగులు ఏ మాత్రం తక్కువ కాదు.. అప్పుడప్పుడు అడవుల నుంచి జనావాసాల్లోకి వచ్చే ఏనుగులు సృష్టించే హంగామా అంతా ఇంతా కాదు. రోడ్లపై వచ్చి, వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనలు మనం ఎన్నో చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో ఓ ఏనుగు తన బలాన్నంతా ఉపయోగించి చెట్టును పడేయయాన్ని చూడవచ్చు. దురద నుంచి ఉపశమనం పొందేందుకు తన శరీరాన్ని చెట్టుకు రుద్దుకుంటుంది. అయితే.. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. తన బలం ముందు చెట్టు నిలవలేకపోయింది. అది చెట్టుకు ఆనుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే చెట్టు కింద పడిపోతుంది. కేవలం17 సెకన్ల నిడివి కలిగిన ఈ క్లిప్ కు అధిక సంఖ్యలో లైక్స్, వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోకు ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా యాడ్ చేశారు. ఈ క్లిప్ ను బహుశా సఫారీ పార్కును సందర్శించిన ఒక పర్యాటకుడు రికార్డ్ చేసి ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏనుగు చేసిన పనికి మనుషులతోపోలుస్తూ.. మానవులు అడవులను నాశనం చేస్తారు. వందలాది జీవ జాతులు అంతరించిపోయేలా చేస్తారు. పులులు, ఖడ్గమృగాల శరీర భాగాలను సేకరించేందుకు వేటాడతారు. వీటన్నింటితో పోలిస్తే ఏనుగు కూడా ఇలాంటి పనే చేసిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి