Pakistan: ప్రతి రెండు గంటలకు ఒక అత్యాచారం.. పెరుగుతున్న పరువు హత్యలు.. దయనీయంగా పరిస్థితులు..

దాయాది దేశం పాకిస్తాన్ లో మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ దేశంలో ప్రతి రెండు గంటలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ కాలంలో నేరారోపణ రేటు (0.2 శాతం) కూడా..

Pakistan: ప్రతి రెండు గంటలకు ఒక అత్యాచారం.. పెరుగుతున్న పరువు హత్యలు.. దయనీయంగా పరిస్థితులు..
Woman Harassment

Updated on: Oct 14, 2022 | 7:04 AM

దాయాది దేశం పాకిస్తాన్ లో మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ దేశంలో ప్రతి రెండు గంటలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ కాలంలో నేరారోపణ రేటు (0.2 శాతం) కూడా చాలా తక్కువగా ఉందని నివేదికలో తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ వార్తా సంస్థ చేపట్టిన సర్వేలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే ప్రకారం.. 2017 నుంచి 2021 వరకు దేశంలో 21,900 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అంటే దేశ వ్యాప్తంగా రోజుకు 12 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. సర్వే నివేదిక ప్రకారం 2017లో దాదాపు 3,327 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2018 లో 4,456 కేసులు నమోదు కాగా, 2019 లో 4,573 కేసులు నమోదయ్యాయి. 2020లో ఈ సంఖ్య 4,478 కి చేరుకోగా, 2021లో అత్యాచార కేసులు 5,169కి పెరిగాయి. ఈ ఏడాది అంటే 2022లో 305 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ 305 కేసుల్లో మేలో 57, జూన్‌లో 91, జూలైలో 86, ఆగస్టులో 71 కేసులు నమోదవడం గమనార్హం.

సర్వేలోని నివేదిక ప్రకారం.. 2022లో పాకిస్తాన్‌లోని 44 కోర్టులలో మహిళలపై లైంగిక హింసకు సంబంధించిన 1,301 కేసులు విచారణకు వచ్చాయి. పోలీసులు 2,856 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. కానీ కేవలం 4 శాతం కేసులు విచారించగలిగారు. అత్యాచార కేసుల్లో శిక్షా రేటు 0.2 శాతం మాత్రమే. 2020 సంవత్సరంలో, యునైటెడ్ నేషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కోర్టులలో మహిళా వ్యతిరేక పక్షపాతంతో 75 దేశాలలో పాకిస్తాన్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులైలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన నివేదికలో లింగ సమానత్వం విషయంలో పాకిస్థాన్ రెండో అధ్వాన్నమైన దేశంగా నిలిచింది. 146 దేశాల్లో జరిపిన సర్వేలో పాకిస్థాన్ 145వ స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా పాకిస్థాన్‌లో మహిళల జనాభా దాదాపు 10.7 మిలియన్లు. అంతే కాదు పాకిస్థాన్‌లో పరువు హత్య కేసులు కూడా పెరిగాయి. దేశంలో పెరుగుతున్న పరువు హత్యలపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు కోరాయి. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ డేటా ప్రకారం గత నాలుగేళ్లలో 1,957 పరువు హత్యలు జరిగాయి.