ఎనిమిది పదుల వయసు అంటే శరీరం ఏ మాత్రం సహకరించని పరిస్థితి. ఈ వయసు ఉన్నవాళ్లలో చాలామంది ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కొంతమందైతే మంచానికే పరిమితమై ఉంటారు. అలాంటిది 89 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తి చేశాడు అమెరికాకు చెందిన మాన్‌ఫ్రెడ్ స్టైనర్. మలి వయసులో పరిశోధనలు చేసి భౌతిక శాస్త్రవేత్త కావాలన్న కలను సాకారం చేసుకున్నాడు. ఈ మేరకు రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసినట్లు స్టైనర్ ప్రకటించాడు.
మాన్‌ఫ్రెడ్‌కి చిన్నతనం నుంచే భౌతిక శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మాక్స్ ప్లాంక్‌ల గురించి చదివి తాను కూడా వారి దారిలోనే నడవాలనుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం డాక్టర్ అవ్వాలని చెప్పడంతో1955లో వియన్నా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ డిగ్రీని సంపాదించాడు. ఆ తర్వాత స్టైనర్ అమెరికా వెళ్లి టఫ్ట్స్ యూనివర్సిటీలో హెమటాలజీని, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోకెమిస్ట్రీని అభ్యసించారు. ఇదే క్రమంలో 1985 నుంచి 1994 వరకు బ్రౌన్‌లోని మెడికల్ స్కూల్లో హెమటాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా సమర్థంగా సేవలందించారు. 2000లో మెడిసిన్ విభాగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న స్టైనర్‌కి మళ్లీ ఫిజిక్స్‌పై మనసు మళ్లింది. దీంతో బ్రౌన్ విశ్వ విద్యాలయం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ తరగతులకు హాజరయ్యాడు. ఆ తర్వాత పీజీ, పీహెచ్‌డీలు పూర్తి చేసి ఫిజిక్స్ సైంటిస్ట్ కావాలన్న తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్నారు. ఈ క్రమంలో మనకున్న ఆసక్తులు, లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదు అన్న మాటలలను స్టైనర్ మరోసారి నిరూపించారు.
Also Read:
Ketchup on Space: మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..
Insurance Crime: రూ.23 కోట్ల బీమా డబ్బు కోసం రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.. చివరకు సీన్ రివర్స్..