AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small House : ఇల్లు చిన్నదే.. కానీ ధర మాత్రం కోట్లలో కొత్త ఇల్లు కూడా కాదు.. మరి ఎందుకంత రేటు..? (వీడియో)

Small House : ఇల్లు చిన్నదే.. కానీ ధర మాత్రం కోట్లలో కొత్త ఇల్లు కూడా కాదు.. మరి ఎందుకంత రేటు..? (వీడియో)

Anil kumar poka
|

Updated on: Nov 13, 2021 | 10:01 AM

Share

సొంత ఇల్లు కలిగి ఉండాలనేది కోట్లాదిమంది కల. అయితే అది అందరికీ నెరవేరదు. ఎందుకంటే నానాటికీ ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ దిగిరానంటోంది. ఈ క్రమంలో 250 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఓ ఇల్లు ఆశ్చర్యపరుస్తోంది.


సొంత ఇల్లు కలిగి ఉండాలనేది కోట్లాదిమంది కల. అయితే అది అందరికీ నెరవేరదు. ఎందుకంటే నానాటికీ ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ దిగిరానంటోంది. ఈ క్రమంలో 250 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఓ ఇల్లు ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా, మసాచుసెట్స్ లోని… న్యూటన్ హైలాండ్స్‌లో ఉంది ఆ ఇల్లు. దాన్ని కొన్న నెల రోజులకు 3 కోట్లకు అమ్మేందుకు బేరం పెట్టారు. ఈ విషయాన్ని కోల్డ్‌వెల్ బ్యాంకర్ రియాలిటీకి చెందిన హాన్స్ బ్రింగ్స్ రిజల్ట్స్ ఏజెన్సీ తెలిపింది.

ఇల్లు చూస్తే అగ్గిపెట్టెలా చిన్నగా ఉంది.. మరి ధర ఎందుకు అలా పెంచేస్తున్నారు అనే డౌట్ అందరికీ ఉంది. ఇదేమీ కొత్త ఇల్లు కూడా కాదు. 50 ఏళ్ల నాటిది. అయితే ఇది బోస్టన్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉండటమే అందుకు కారణం. అక్కడ ఇళ్లు, ఆస్తుల విలువ ఆకాశంలో ఉంటుంది. అందుకే దీని ధర దిమ్మతిరిగే రేంజ్‌లో ఉంది.

ఇంకా ఈ ఇంటికి దగ్గర్లోనే ప్రజారవాణా సౌకర్యం, పార్కులు, షాపింగ్ కాంప్లెక్సులు ఉన్నాయి. ఇది గెస్టు హౌసులా గానీ, మెడిటేషన్ సెంటర్, స్టోరేజీ రూమ్, ఎక్సర్‌సైజ్ రూమ్‌ ఇలా పలురకాలుగా వాడుకోవచ్చని డిస్క్రిప్షన్‌లో చెప్పారు. అంటే అంత రేటు పెట్టి కొనుక్కున్నా… ఇందులో మనుషులు రెగ్యులర్‌గా జీవించడం కష్టమే అన్నమాట. అందుకే ఈ ఇంటిని కోట్లు పెట్టి కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే… ఈ ఇంటిని చూసి బ్యాంకులు కూడా లోన్‌ ఇవ్వనంటున్నాయి. దాంతో కొనాలనుకున్న వారు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 13, 2021 09:50 AM