AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

California: కాలిఫోర్నియాలో 8 మంది భారతీయులకు జీవితఖైదు?.. కారణం ఇదేనా!

కడ్నాప్‌ చేసి, సామూహిక హింసకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టైన 8 మంది భారతీయులకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించిందని అమెరికన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది భారతీయులకు అమెరికా చట్టాల ప్రకారం జీవితఖైదు విధించనున్నట్టు స్పష్టం చేశారు.

California: కాలిఫోర్నియాలో 8 మంది భారతీయులకు జీవితఖైదు?.. కారణం ఇదేనా!
America
Anand T
|

Updated on: Jul 19, 2025 | 10:17 AM

Share

కాలిఫోర్నియాలో సామూహిక హింస, కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన 8 మంది భారతీయులకు జీవిత ఖైదు విధించబడింది. ఈ కేసులో బెయిల్‌ను కోరుతూ భారతీయులు కోర్టును ఆశ్రయించగా.. బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించిందని అమెరికన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. విచారణలో నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు అమెరికన్ చట్టాల ప్రకారం వారికి జీవిత ఖైదు విధించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్, హింస, దోపిడి, తుపాకులతో సాక్షులను బెదరించడం వంటి ఆరోపణలతో మన్‌ప్రీత్ సింగ్ రంధావా, సరబ్‌జిత్ సింగ్, గుర్తాజ్ సింగ్, అమృత్‌పాల్ సింగ్, పవిత్ర్ సింగ్, విశాల్ అనే వ్యక్తులను ఆరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ఆరోపణల ఆధారంగా, వారికి జీవిత ఖైదు శిక్ష పడనున్నట్టు శాన్ జోక్విన్ కౌంటీ జిల్లా అటార్నీ రాన్ ఫ్రీటాస్ అన్నారు. దిల్‌ప్రీత్ సింగ్, అర్ష్‌ప్రీత్ సింగ్ సహా గ్యాంగ్‌లోని మరో ఐదుగురు వ్యక్తులు ఆయుధాలకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నట్టు ఆయన ధృవీకరించారు.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో జూలై 11న స్థానిక ఏజెన్సీలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా ఈ వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే పట్టుబడిన 8 మంది వ్యక్తులు భారతీయులేనని శాన్ జోక్విన్ కౌంటీ పోలీసు ప్రతినిధి ధృవీకరించారు. జూన్ 19న, భారతీయ సమాజానికి సంబంధించిన సమాచారం కోసం నిందితులు ఈ కిడ్నాప్‌పు పాల్పడినట్టు వారు తెలిపారు. కిడ్నాప్ చేసిన తర్వాత బాధితుడిని చిత్ర హింస?లకు గురిచేసినట్టు గుర్తించారు. పట్టుబడిన 8 మంది నుంచి తుపాకులు, ఒక అస్సాల్ట్ రైఫిల్, వందలాది రౌండ్ల మందుగుండు సామగ్రి, $15,000 డాలర్స్‌ నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

అరెస్టు చేసిన వ్యక్తులను జూలై 24న కోర్టు ముందు హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. ఈ ముఠాల గురించి మరింత సమాచారం అందించాలని స్థానిక చట్ట అమలు అధికారులు భారతీయ సభ్యులను కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.