Russia Ukraine War: ఉక్రెయిన్ పాఠశాలపై రష్యా బాంబు దాడి.. 60 మంది మృతి..
ఉక్రెయిన్ లుహాన్సక్లోని బిలోహోర్వికా ప్రాంతంలో ఉన్న పాఠశాలపై బాంబు దాడి జరిగింది. ఘటన జరిగిన సమయంలో భవనంలో 90 మంది ఉన్నారు.
Russia Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో తూర్పు ఉక్రెయిన్లోని ఓ పాఠశాలపై రష్యా సైన్యం బాంబులతో విరుచుకుపడింది. ఈ బాంబు దాడుల్లో 60 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఉక్రెయిన్ లుహాన్సక్లోని బిలోహోర్వికా ప్రాంతంలో ఉన్న పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఘటన జరిగిన సమయంలో భవనంలో 90 మంది ఉన్నారని 30 మందిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగిన్నట్లు గవర్నర్ సెర్హి గైడై వెల్లడించారు. శిథిలాలను తొలగిస్తే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని స్థానిక అధికారులు తెలిపారు.
లుహాన్స్క్ ప్రావిన్స్ గవర్నర్ ప్రకారం.. శనివారం బాంబు దాడి తర్వాత బిలోహోరివ్కా గ్రామంలోని పాఠశాల అగ్నికి ఆహుతైంది. అత్యవసర సిబ్బంది రెండు మృతదేహాలను గుర్తించి 30 మందిని రక్షించారని తెలిపారు. దాదాపు 90 మంది ఆశ్రయం పొందుతున్న పాఠశాలపై రష్యా బలగాలు శనివారం మధ్యాహ్నం బాంబును వేశాయని గవర్నర్ సెర్హి గైడై చెప్పారు. తూర్పు పారిశ్రామిక కేంద్రంగా ఉన్న డోన్బాస్ ప్రాంతంలో ఈ నగరం ఒకటి. కాగా.. ఈ దాడిపై ఇంకా రష్యా స్పందించాల్సి ఉంది.
Also Read: