మిస్టరీగా మారిన ఆ 39 మృతదేహాలు.. మన పొరుగుదేశం వాళ్లయేనా..?

సంచలనం సృష్టించిన యూకే డెడ్ బాడీస్ కంటైనర్‌ మిస్టరీ వీడుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. లండన్‌లోని ఎసెక్స్‌కు చెందిన గ్రేస్‌ ప్రాంతంలో ఓ అనుమానాస్పద కంటెనైర్‌ను తనిఖీ చేస్తుండగా.. అందులో 39 డెడ్ బాడీస్ పట్టుబడిన విషయం తెలిసిందే. అందులో 38 మంది పెద్దవారివి కాగా.. ఒక టీనేజర్‌ బాడీ కూడా ఉన్నట్లుగా ఎసెక్స్‌ పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఇమిగ్రేషన్‌ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. […]

మిస్టరీగా మారిన ఆ 39 మృతదేహాలు.. మన పొరుగుదేశం వాళ్లయేనా..?

సంచలనం సృష్టించిన యూకే డెడ్ బాడీస్ కంటైనర్‌ మిస్టరీ వీడుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. లండన్‌లోని ఎసెక్స్‌కు చెందిన గ్రేస్‌ ప్రాంతంలో ఓ అనుమానాస్పద కంటెనైర్‌ను తనిఖీ చేస్తుండగా.. అందులో 39 డెడ్ బాడీస్ పట్టుబడిన విషయం తెలిసిందే. అందులో 38 మంది పెద్దవారివి కాగా.. ఒక టీనేజర్‌ బాడీ కూడా ఉన్నట్లుగా ఎసెక్స్‌ పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఇమిగ్రేషన్‌ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆ కంటైనర్‌ని పోలీసులు సమీపంలోని టిల్‌బరీ డాక్స్‌ అనే ప్రాంతానికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే లారీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఆ మృతదేహాలు ఎవరివన్న దానిపై విచారిస్తుండగా.. ఓ సంచలన విషయం బయటపడుతోంది. ఆ 39 డెడ్‌ బాడీస్ మన పొరుగుదేశమైన చైనాకి సంబంధించినవిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఎసెక్స్‌ పోలీసులు, చైనా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. 2000 సంవత్సరంలో చైనాకు చెందిన 58 మంది మృతదేహాలను డచ్‌కు చెందిన లారీలో డోవర్‌ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి పట్టుబడ్డ మృతదేహాలు కూడా చైనీయులవిగా భావిస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu