Rishi Sunak: మూడు దేశాల్లో ప్రధాన బాధ్యతల్లో భారత సంతతి నాయకులు.. వారి సరసన రిషి సునాక్..

ప్రపంచ దేశాల్లో భారత సంతతి ప్రజలు లేని దేశం ఉండదంటే అతిశయోక్తి కాదు. చాలా దేశాల్లో రాజకీయాల్లో కూడా భారత సంతతి ప్రజలు క్రీయాశీలకంగా ఉన్నారు. అయితే ఇతర దేశాల్లో ముఖ్యమైన బాధ్యతల్లో ముగ్గురు భారతీయులు..

Rishi Sunak: మూడు దేశాల్లో ప్రధాన బాధ్యతల్లో భారత సంతతి నాయకులు.. వారి సరసన రిషి సునాక్..
Rishi Sunak

Updated on: Oct 24, 2022 | 7:51 PM

ప్రపంచ దేశాల్లో భారత సంతతి ప్రజలు లేని దేశం ఉండదంటే అతిశయోక్తి కాదు. చాలా దేశాల్లో రాజకీయాల్లో కూడా భారత సంతతి ప్రజలు క్రీయాశీలకంగా ఉన్నారు. అయితే ఇతర దేశాల్లో ముఖ్యమైన బాధ్యతల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. అమెరికా (యునైటెడ్ స్టేట్స్) నుండి పోర్చుగల్ వరకు భారత సంతతికి చెందిన రాజకీయ నాయకులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో కీలకమైన బాధ్యతల్లో పనిచేస్తున్నారు. ఈ జాబితాలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషి సునాక్ ఈ జాబితాలో చేరారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాల్లో భారతీయులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. అంతేకాదు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీలలో సీఈవోలుగా, ఇతర ముఖ్యమైన బాధ్యతల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఓ పెద్ద దేశమైన బ్రిటన్ కు ఓ భారత సంతతి వ్యక్తి ప్రధానమంత్రి కావడం దేశానికి ఎంతో గర్వకారణం. గతంలో బ్రిటిషువారు భారతదేశాన్ని పాలించారు. కాని ఇప్పుడు ఎన్నిక ద్వారా భారత సంతతి వ్యక్తి అధికారికంగా బ్రిటన్ ప్రధాని అయ్యారు. రిషి సునాక్ కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రధాన బాధ్యతల్లో ఉన్న ముగ్గురు భారత సంతతి వ్యక్తులు ఎవరో ఓ సారి తెలుసుకుందాం.

కమలా హారిస్

Kamala Harris

కమలా హారిస్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షులు జో బిడెన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు ఆమె. అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా నిలిచారు. తమిళనాడు మూలాలు ఉన్న కమలా హారిస్ 2011 నుండి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా కూడా పనిచేశారు.

ప్రవింద్ జుగ్నాథ్

Pravind Jugnauth

ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ మారిషస్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అంతకుముందు మంత్రివర్గంలో అనేక ప్రధాన పదవులు చేపట్టారు. వీరి పూర్తికులు భారత మూలాలకు చెందినవారు. దీంతో ప్రవింద్ జుగ్నాథ్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడమే కాకుండా మారిషస్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆంథోనీ కోస్టా

Antonio Costa

ఆంటోనియో కోస్టా పోర్చుగల్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓ భారత సంతతి వ్యక్తి పోర్చుగీస్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. వీరి కుటుంబ మూలాలు గోవాలో ఉన్నాయి. గతంలోనూ పోర్చుగీస్ ప్రభుత్వంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ ముగ్గురు నేతలు కాకుండా వీరి జాబితాలో రిషి సునాక్ కూడా చేరారు. మొత్తం నలుగురు భారత సంతతి వ్యక్తులు ప్రపంచ దేశాల్లోని ప్రధాన బాధ్యతల్లో ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..