Afghanistan: భూకంపంతో ఉలిక్కి పడిన అఫ్గాన్.. 26 మంది మృతి..

|

Jan 18, 2022 | 6:02 AM

ఇప్పటికే తాలిబన్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడుతోన్న అఫ్గాన్ ప్రజలు భూకంపంతో ఉలిక్క పడ్డారు.   ఖాదీస్ జిల్లాలోని బాగ్దీస్ ప్రాంతంలో సోమవారం సంభవించిన భూకంపం కారణంగా సుమారు 26 మంది  మృత్యువాత పడ్డారు. 

Afghanistan: భూకంపంతో ఉలిక్కి పడిన అఫ్గాన్.. 26 మంది మృతి..
Follow us on

ఇప్పటికే తాలిబన్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడుతోన్న అఫ్గాన్ ప్రజలు భూకంపంతో ఉలిక్క పడ్డారు.   ఖాదీస్ జిల్లాలోని బాగ్దీస్ ప్రాంతంలో సోమవారం సంభవించిన భూకంపం కారణంగా సుమారు 26 మంది  మృత్యువాత పడ్డారు.  యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3 గా నమోదైందని తెలిసింది. కాగా శిథిలాల కింద చిక్కుకుని ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలతో సహా మొత్తం 26 మంది మృతి చెందారని ప్రావీన్స్ ప్రతినిధి బాజ్ మహ్మద్ సర్వారీ తెలిపారు. చాలామంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  కాగా ముఖ్ర్ జిల్లాలో కూడా భూకంపం సంభవించిందని అయితే అక్కడ జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని  సర్వారీ చెప్పుకొచ్చారు.

తరచూ భూకంపాలు..

కాగా గతేడాది ఆగస్టులో అఫ్గాన్ ను పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు తాలిబన్లు. అరాచక పాలనతో అక్కడి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక సహాయం కూడా ఆగిపోయింది. ఫలితంగా ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. తినడానికి తిండి కూడా దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో భూకంపంతో మరింత నష్టం వాటిల్లింది.  కాగా హిందూకుష్ పర్వత శ్రేణుల కారణంగా అఫ్గాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. దీనికి తోడు ఇక్కడి ప్రజలు నిర్మించుకున్న గృహాలు, భవనాల కారణంగా  మృతుల సంఖ్య బాగా పెరుగుతోంది.  2015లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సుమారు 280 మంది మృత్యువాత పడ్డారు.

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో జంట బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ బకాయిలు, పీఆర్సీల జీవోల విడుదల..

Road Accident: గుంటూరు జిల్లాలో విషాదం.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి దుర్మరణం..