Minister swim 12 hours: ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదం.. 12 గంటలు ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో..

Minister swim 12 hours: ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదం.. 12 గంటలు ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 18, 2022 | 10:23 PM

కష్టాల్లో చిక్కుకుని బయటపడేందుకు చుట్టూ ఏ దారి కనిపించనప్పుడు కూడా దృఢసంకల్పం ఉంటే కష్టాలకు ఎదురీది ప్రాణాలు నిలబెట్టుకోవచ్చని నిరూపించారు మడగాస్కర్‌ దేశ రక్షణ మంత్రి. సెర్జ్ గెల్లె ప్రయాణిస్తున్న విమానం నడిసముద్రంలో కూలిపోయిన వేళ...


కష్టాల్లో చిక్కుకుని బయటపడేందుకు చుట్టూ ఏ దారి కనిపించనప్పుడు కూడా దృఢసంకల్పం ఉంటే కష్టాలకు ఎదురీది ప్రాణాలు నిలబెట్టుకోవచ్చని నిరూపించారు మడగాస్కర్‌ దేశ రక్షణ మంత్రి. సెర్జ్ గెల్లె ప్రయాణిస్తున్న విమానం నడిసముద్రంలో కూలిపోయిన వేళ అలుపు సొలుపు లేకుండా 12 గంటలపాటు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు.64 మంది ప్రయాణికులతో వెళ్తూ హిందూ మహాసముద్రంలో బోటు ముగినిపోయిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు మంత్రి సెర్జ్‌ గెల్లె హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ ఒక్కసారిగా సముద్రంలో కూలిపోయింది. ఆయనతో పాటు ప్రయాణించిన ముగ్గురి జాడ కనిపించలేదు. ఆయన మాత్రం సీటును ఊడదీసుకుని, దానిని లైఫ్ జాకెట్‌లా వాడుకున్నాడు. ఆపై 12 గంటల పాటు ఈది తీరానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన ఓ జాలరి తీరానికి సమీపంలో ఆయనను గమనించి ఒడ్డుకు చేర్చాడు. మరోవైపు, మంత్రితో పాటు ప్రయాణించిన వారిలో ఉన్న చీఫ్ వారంట్ అధికారి జిమ్మీ లాయిట్సారా కూడా అలాంటి సాహసమే చేశారు. ఆయన ఈదుకుంటూ మహాంబో తీరానికి చేరుకున్నారు.ప్రాణాలతో బయటపడిన రక్షణ మంత్రి జనరల్ సెర్జ్ గెల్లె ఆ తర్వాత ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. దేవుడి నుంచి తనకు పిలుపు రానందుకే తీరానికి చేరుకోగలిగానని పేర్కొన్నారు. తాను పైలట్ వెనక సీట్లో కూర్చున్నానని, ప్రమాదం జరిగిన తర్వాత సీటును బలవంతంగా ఊడబెరికి లైఫ్ జాకెట్‌లా వాడుకున్నట్టు చెప్పారు. బతకడానికి ఏమేమి చెయ్యాలో అన్నీ చేశానని, బరువైన వస్తువులన్నీ వదిలేశానని గుర్తు చేసుకున్నారు.

Published on: Jan 18, 2022 09:18 PM