మద్యం మత్తులో అరాచకం.. ఫ్లేర్ గన్‌తో కాల్పులు.. కేఫ్‌లో మంటలు చెలరేగి 15 మంది దుర్మరణం..

|

Nov 05, 2022 | 3:32 PM

ర‌ష్యా కోస్ట్రోమా నగరంలోని ఓ బార్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. కోస్ట్రోమా న‌గ‌రంలో పోలిగాన్ అనే బార్ కేఫ్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

మద్యం మత్తులో అరాచకం.. ఫ్లేర్ గన్‌తో కాల్పులు.. కేఫ్‌లో మంటలు చెలరేగి 15 మంది దుర్మరణం..
Kostroma Cafe Blaze
Follow us on

ర‌ష్యా కోస్ట్రోమా నగరంలోని ఓ బార్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. కోస్ట్రోమా న‌గ‌రంలో పోలిగాన్ అనే బార్ కేఫ్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ అగ్నిప్రమాదంలో 15 మంది మరణించగా.. 25 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. డ్యాన్స్ ఫ్లోర్‌పై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి “ఫ్లేర్ గన్” పేల్చడంతో పాపులర్ బార్‌లో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని టాస్ వార్తా సంస్థ నివేదించింది. కాల్పుల అనంతరం లాజిస్టికల్ సెంటర్‌లోని పోలిగాన్ అంతటా మంటలు చెలరేగాయని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయని, ఉదయం 7:30 గంటలకు మంటలను ఆర్పివేశామని అధికారులు తెలిపారు.

గవర్నర్ సెర్గీ సిట్నికోవ్ ఇంతకుముందు 13 మంది మరణించారని వెల్లడించారు. అయితే అత్యవసర సేవల అనంతరం మరో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపారు. మరో రెండు మృతదేహాల వెలికితీత అనంతరం బాధితుల సంఖ్య 15కి చేరిందని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ పేర్కొంది. మాస్కోకు ఈశాన్యంగా 300 కిలోమీటర్ల దూరంలో కోస్ట్రోమా నగరం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫేమస్ బార్ లో మంటలు చెలరేగడంతో భవనం నుంచి 250 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఈఘటన జరిగిన సమయంలో “ఫ్లేర్ గన్”తో కాల్చిన వ్యక్తి.. మద్యం మత్తులో ఓ మహిళతో కలిసి ఉన్నాడని.. కాల్పులే అగ్నిప్రమాదానికి కారణం కావొచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..