Golden Treasure: తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యేళ్లనాటి బంగారు నిధి, వెండి నాణాలు..
కానీ, ఇక్కడ లభించిన నాణేలు సుమారు 1250 నాటిదని చెబుతున్నారు. కానీ, నిధిని శుభ్రం చేయడానికి, పరిశోధించడానికి, వాటి వినియోగ కాలాన్ని నిర్ధారించడానికి ఇంకా సమయం కావాలని చెబుతున్నారు నిపుణులు.
నెదర్లాండ్స్‌లో భారీగా ఉన్న పురాతన నిధి దొరికింది. డచ్ చరిత్రకారుడు 1,000 సంవత్సరాల పురాతన మధ్యయుగపు కాలం నాటి బంగారు నిధిని కనుగొన్నాడు. ఇందులో నాలుగు బంగారు చెవి దుద్దులు, రెండు బంగారు ఆకుల స్ట్రిప్స్, 39 వెండి నాణేలు ఉన్నాయి.. ఈ మేరకు డచ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ యాంటిక్విటీస్ గురువారం ప్రకటించింది.
నెదర్లాండ్స్‌కు చెందిన లోరెంజో రుయిజ్టర్ అనే వ్యక్తి తనకు 10 ఏళ్ల వయస్సు నుండే ఇలాంటి నిధి వేట కొనసాగిస్తున్నాడు. 2021 లో చిన్న ఉత్తర నగరమైన హూగ్‌వౌడ్‌లో మెటల్ డిటెక్టర్‌ను ఉపయోగించి నిధిని కనుగొన్నాడు. అక్కడి భూమిని ట్రాక్టర్‌తో తవ్వించానని, అక్కడ పురాతన కళాఖండాలు దొరికాయని చెప్పాడు. అవి వెయ్యేళ్ల నాటివని భావిస్తున్నాను అన్నాడు. ఇలాంటి బంగారు ఆభరణాలు నెదర్లాండ్స్‌లోనే దొరికాయని మ్యూజియం అధికారులు తెలిపారు. ఈ మేరకు నిధి విషయం గురించి లోరెంజో ప్రస్థావిస్తూ..ఇంత విలువైనది కనుగొనడం చాలా ప్రత్యేకమైనదని, నేను దానిని నిజంగా వర్ణించలేను. ఇలాంటివి కనిపెడతానని నేను ఎప్పుడూ ఊహించలేదు”అని చెప్పాడు.
నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆంటిక్విటీస్ నిపుణులు నిధి వస్తువులను శుభ్రం చేయడానికి, పరిశోధించడానికి, వాటి వినియోగ కాలాన్ని నిర్ధారించడానికి ఇంకా సమయం కావాలని చెప్పారు. కానీ, ఇక్కడ లభించిన నాణేలు సుమారు 1250 నాటిదని చెబుతున్నారు. నెదర్లాండ్స్‌లో మధ్య యుగాల నాటి బంగారు ఆభరణాలు చాలా అరుదు అని మ్యూజియం పేర్కొంది.