Viral: ఏడాది పాపకు అనారోగ్య సమస్యలు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సిటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్
బిడ్డ పుట్టిన తర్వాత కూడా మెదడులో ఆ పిండం అలాగే ఉండిపోయింది. దానికి కారణం.. ఆ చిన్నారి రక్త సరఫరాను ఆ పిండం పంచుకోవడమే.
ఆ పాప వయస్సు ఏడాది మాత్రమే. చిన్నారికి హెల్త్ ఇష్యూస్ ఉండటంతో.. పేరెంట్స్ ఆందోళన చెందారు. వెంటనే హాస్పిటల్‌కు తీసకెళ్లారు. పాప న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతుంది వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. ఒక నిర్దిష్ట పనిని చేయడానికి.. శరీర కండరాలు సహకరించడం లేదని ఐడెంటిఫై చేశారు. ఆలస్యంగా చేయకుండా వెంటనే సిటీ స్కాన్ చేశారు. రిపోర్ట్ చూసి.. తొలుత డాక్టర్లే స్టన్ అయ్యారు. పాప మెదడులో పిండం ఉన్న విషయం బయటపడింది. చైనాలోని షాంఘైలో ఈ వింత ఘటన వెలుగుచూసింది.
వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు.. మెదడు నుంచి ఆ పిండాన్ని బయటకు తీశారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదని డాక్టర్లు తెలిపారు ఈ సంఘటనను వైద్య పరిభాషలో ‘ఫీటన్ ఇన్ ఫీటు’ అని అంటారట. ఇక, ఈ చిన్నారి మెదడులో ఉన్న పిండం 4 అంగుళాలు ఉందని.. దానికి పలు అవయవాలతో పాటు వేళ్ల గోర్లు సైతం అభివృద్ధి చెందాయని వివరించారు. కాగా, అమ్మ గర్భంలో ఉన్నప్పుడే అవి చిన్నారి మెదడులో అభివృద్ధి చెంది ఉంటాయని వైద్యులు అంచనా వేశారు.
తల్లి గర్భంలో ఉన్నప్పుడు కవల పిల్లల్లో.. ఒక పిండం ఎదిగి మరో పిండం ఎదగకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు వివరించారు. పిండాలు వృద్ధి జరిగే సమయంలో విభజన సరిగా జరగక.. ఒక పిండం మెదడులో మరో పిండం మిళితమయ్యింది. పాప పుట్టేటప్పటి వరకు ఈ పిండం గర్భస్థ శిశువుతో పాటు మెదడులో పెరిగింది. అనంతరం చిన్నారి మెదడులో అలాగే ఉండిపోయింది. ఇటువంటి కేసులు ప్రపంచంలో చాలా అరుదుని.. 10 లక్షల మంది శిశువులలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..