Breaking News
  • విశాఖ శారదాపీఠంలో విషజ్వర పీడా హర యాగానికి పూర్ణాహుతి. 11 రోజుల పాటు సాగిన అమృత పాశుపత సహిత యాగం. యాగాన్ని పర్యవేక్షించిన శారదా పీఠాధిపతులు.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర.
  • కరోనా వల్ల ఆక్వా రంగం ఇబ్బందుల్లో ఉంది. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారం సేకరిస్తున్నాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తున్నాం-మోపిదేవి.
  • ప్రజల రాకపోకలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం-మంత్రి కన్నబాబు. కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడం. ప్రజలకు సాయం అందించడం. ఫారెన్‌ రిటర్న్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక వ్యూహం-కన్నబాబు.
  • రాష్ట్రంలో పాల సరఫరాపై వివిధ డైరీలతో మంత్రి తలసాని సమీక్ష. డోర్‌డెలివరీ యాప్‌ల ద్వారా పాల సరఫరా. పాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు-మంత్రి తలసాని. పాల వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు-తలసాని.
  • నిజామాబాద్‌లో కల్లు దొరకక ఇద్దరు మృతి. లాక్‌డౌన్‌ కారణంగా వారం రోజులుగా దొరకని కల్లు.
  • లాక్‌డౌన్‌తో చెన్నైలో విజయనగరం వాసుల అవస్థలు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు. టీవీ9కు తమ గోడు చెప్పుకున్న కూలీలు.

‘ఇండియాతో వాణిజ్య ఒప్పందమా ? ఇప్పట్లో లేనట్టే’…

we are not treated very well by india says trump india visit feb.24-25 pm modi ahmadabad stadium, ‘ఇండియాతో వాణిజ్య ఒప్పందమా ? ఇప్పట్లో లేనట్టే’…

ఇండియాతో అతి ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పట్లో కుదుర్చుకునే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నవంబరులో తమ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయని, ఆ లోగా భారత్ తో డీల్ కుదరకపోవచ్ఛునని ఆయన చెప్పారు. ఈ నెల 24-25 తేదీల్లో ట్రంప్ ఇండియాను సందర్శించనున్నారు. ఆయన రాక సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య కోట్లాది డాలర్ల విలువైన భారీ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికలు జరిగే లోగా ఈ ప్రక్రియ జరుగుతుందా అన్న విషయం తాను చెప్పలేనని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల అనంతరమే ఇందుకు అవకాశాలు ఉన్నాయని, కానీ డీల్ తప్పకుండా కుదుర్చుకుంటామని అన్నారు. మంగళవారం వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఉభయ దేశాల మధ్య గల వాణిజ్య సంబంధాల పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఈ విషయంలో ఇండియా తమను దాదాపు నిర్లక్ష్యం చేస్తోందని అభిప్రాయపడ్డారు. ‘వుయ్ ఆర్ నాట్ ట్రీటెడ్ వెల్ బై ఇండియా’ అని వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని మోదీని ప్రశంసిస్తూ.. ఆయనను కలుసుకునేందుకు తహతహలాడుతున్నానని తెలిపారు.

ఢిల్లీలో మోదీని, ఇతర మంత్రులను కలిసిన అనంతరం తామిద్దరం అహ్మదాబాద్ వెళ్తామని, అక్కడ భారీ స్టేడియంలో  ప్రసంగించనున్నామని చెప్పిన ఆయన.. విమానాశ్రయానికి, ఈ స్టేడియానికి మధ్య సుమారు 70 లక్షలమంది ప్రజలు తనను ఆహ్వానం పలుకుతారని మోడీ చెప్పారని వెల్లడించారు. ఆ స్టేడియం ఇంకా నిర్మాణ దశలో ఉందని, ప్రపంచంలో అది అతి పెద్ద స్టేడియం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదెంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మీరంతా కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను అని ఆయన చెప్పారు.

 

 

Related Tags