‘ఛత్రపతి’ రీమేక్.. బెల్లంకొండ కోసం మార్పులు చేస్తోన్న విజయేంద్ర ప్రసాద్
ఛత్రపతి రీమేక్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్‌ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది

Chatrapathi remake Bollywood: ఛత్రపతి రీమేక్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్‌ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ రీమేక్ కోసం ఇప్పుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలుగులో ఛత్రపతి కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా.. ఇప్పుడు రీమేక్ కోసం ఆయన ఆ కథలో పలు మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆయన కథను మారుస్తున్నట్లు టాక్. మరోవైపు ఈ రీమేక్‌కి దర్శకుడిగా మొదట సుజీత్ పేరు వినిపించగా.. ఇప్పుడు వినాయక్ పేరు వినిపిస్తోంది. (బాలకృష్ణ- బోయపాటి మూవీ.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్రను తీసేస్తున్నారా..!)
కాగా ఇదిలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్‌లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన నభా నటేష్, అనూ ఇమ్మాన్యుల్ రొమాన్స్ చేస్తున్నారు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. (కోహ్లి సరైన నిర్ణయం తీసుకున్నాడు.. విరాట్‌కి రవిశాస్త్రి మద్దతు)