కసిగా పనిచేసి కళ నెరవేర్చుకున్నాడు.. ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’తో తానేంటో నిరూపించుకున్నాడు..

అతడు ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు. సినీ దర్శకుడు కావాలనేది అతడి ఆశయం. దానికోసం రాత్రింబవళ్లు శ్రమించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చాడు.

కసిగా పనిచేసి కళ నెరవేర్చుకున్నాడు.. ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’తో తానేంటో నిరూపించుకున్నాడు..
Follow us
uppula Raju

|

Updated on: Nov 23, 2020 | 2:12 PM

అతడు ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు. సినీ దర్శకుడు కావాలనేది అతడి ఆశయం. దానికోసం రాత్రింబవళ్లు శ్రమించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చాడు. అందివచ్చిన సాప్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేశాడు.. అవకాశాల కోసం ప్రయత్నించాడు. రెండేళ్లకు విజయం సాధించాడు. ఆతడే ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ చిత్ర దర్శకుడు వినోద్ అనంతోజు.

భవ్య క్రియేషన్ సంస్థ నుంచి హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ, కన్నడ నటి వర్ష ప్రధాన పాత్రల్లో నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా అమెజాన్‌లో ప్లాట్ ఫాంపై రిలీజైంది. దర్శకుడు వినోద్ అనంతోజు మొదటి సారిగా మెగాఫోన్ పట్టుకొని మిడిల్ క్లాస్ నేపథ్యంలో సినిమా తెరెకెక్కించి విజయం సాధించాడు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. వినోద్ కాలేజీ రోజుల్లోనే షాట్ ఫిల్మ్స్ తీసేవాడు. శూన్యం అనే లఘు చిత్రానికి మంచి పేరు వచ్చింది. సినిమా మొత్తం గుంటూరు, తెనాలి సమీపంలో చిత్రీకరించారు. ఇతర తారాగణం మొత్తం రంగస్థల నటులను తీసుకున్నారు. మధ్య తరగతి కథతో ప్రేక్షకులను మెప్పించాడు. కాగా వినోద్ తండ్రి విశాలాంధ్ర బుక్‌హౌజ్ మేనేజర్‌గా పని చేస్తారు. తల్లి గృహిణి ఓ సోదరి ఉంది. ఏడేళ్లు ఉద్యోగం చేసిన వినోద్ ఎట్టకేలకు తను అనుకున్నలక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.