‘నివర్’ అలెర్ట్ : పుదుచ్చేరికి 600 కి.మీ దూరంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతూ పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతూ పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో ఈ వాయుగుండం తుపానుగా బలపడనుంది. తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్ -మహాబలిపురం మధ్య ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తుఫాన్ తీరాన్ని దాటే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపారు. ఇరాన్ దేశం సూచించిన.. ‘నివర్’ అనే పేరు ఈ తుపానుకు పెట్టనున్నారు.
వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. ఆంధ్రప్రదేశ్ పాటు తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే..తమిళనాడుపై కూడా తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను ప్రభావం 26వ తేదీ వరకూ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
Also Read :
తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్ ధుపేలియా మృతి
గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య
ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు
గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి విజయశాంతి, రేపే ముహూర్తం