WhatsApp Feature: వాట్సాప్ అదిరిపోయే ఫ్యూచర్..! దీనితో ఫేక్‌న్యూస్ రియల్‌న్యూస్ ఏదో ఈజీగా కనిపెట్టేయొచ్చు..(వీడియో)
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏది అంటే గుర్తొచ్చే పేరు వాట్సాప్. కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకున్న ఈ యాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆట్రాక్ట్ చేస్తుంటుంది. ఈ దిగ్గజ సంస్థ తాజాగా మరో కొత్త ఎత్తుగడతో యూజర్ల ముందుకు రానుంది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏది అంటే గుర్తొచ్చే పేరు వాట్సాప్. కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకున్న ఈ యాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆట్రాక్ట్ చేస్తుంటుంది. ఈ దిగ్గజ సంస్థ తాజాగా మరో కొత్త ఎత్తుగడతో యూజర్ల ముందుకు రానుంది. యూజర్ పంపించే మెసేజ్ ఎక్కువ సార్లు ఫార్వర్డ్ అయితే సదరు మెసేజ్‌కు ఫార్వార్డ్ అనే ట్యాగ్‌లైన్ కనిపించేలా ఇప్పటికే వాట్సాప్ చర్యలు తీసుకుంది. అయితే ఇకపై ఎలా పడితే అలా మెసేజ్‌లను అన్ని గ్రూప్‌ల్లోకి ఫార్వడర్డ్ చేయడం కుదరకుండా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లకు మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయడాన్ని పరిమితం చేయనుంది. దీంతో యూజర్ ఒక గ్రూప్ కంటే ఎక్కువ గ్రూప్స్‌లోకి మెసేజ్‌లను ఒకే సమయంలో ఫార్వర్డ్ చేయలేరు. దీంతో ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్ యోచిస్తోంది. ఈ ఫీచర్ తొలుత వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..