చైనా కార్లకు కడుపొచ్చింది !! వాతావరణ మార్పులే కారణమా ??
కారు బ్యానెట్ బానపొట్టలా ఉబ్బడంతో చైనాలోని జనం వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ‘చైనా కార్లకు కడుపొచ్చింది’ అనే ట్యాగ్‌తో ఎక్స్‌లో ఈ బానపొట్ట కార్ల ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగని ఇవేమీ కృత్రిమ మేధ మాయ కాదు. తయారీలో లోపమూ కాదు. పర్యావరణ మార్పుల కారణంగా ఉబ్బి పోయాయట.. ఇందులో ప్రముఖ కంపెనీల కార్లకూ ఇదే పరిస్థితి రావడం చూసి ఇదేం వింత అనుకుంటున్నారు.
కారు బ్యానెట్ బానపొట్టలా ఉబ్బడంతో చైనాలోని జనం వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ‘చైనా కార్లకు కడుపొచ్చింది’ అనే ట్యాగ్‌తో ఎక్స్‌లో ఈ బానపొట్ట కార్ల ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగని ఇవేమీ కృత్రిమ మేధ మాయ కాదు. తయారీలో లోపమూ కాదు. పర్యావరణ మార్పుల కారణంగా ఉబ్బి పోయాయట.. ఇందులో ప్రముఖ కంపెనీల కార్లకూ ఇదే పరిస్థితి రావడం చూసి ఇదేం వింత అనుకుంటున్నారు. కార్లపై పెయింట్ దెబ్బతినకుండా ఉండటానికి సన్నని వినైల్ ఫిల్మ్‌ను పై నుంచి అతికిస్తారు. అందంగా కనిపించటం కోసం, వాణిజ్య ప్రకటనల కోసమూ వీటిని అతికిస్తుంటారు. అయితే తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉంటే… వాటి వెనకాల అతికించిన రసాయనం వ్యాకోచం చెందిన కారణంగా ఇలా ఉబ్బిపోయే అవకాశం ఉంటుందన్నని అంటున్నారు నిపుణులు. ఈసారి చైనాలో ఎండలు రికార్డు స్థాయిలో ఉండటంతో… ఇలాంటి విపరిణామాలు సంభవిస్తున్నాయంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. షాంఘైలో 40 డిగ్రీలు దాటింది. నాణ్యమైన ఫిల్మ్‌ను వాడటంతోపాటు… ఎండలో కార్లను ఎక్కువ సేపు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నది నిపుణుల సూచన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనిషి మెదడు తనని తానే తింటుందా ?? పరిశోధనలో తేలిన షాకింగ్ నిజాలు !!
కమిషనర్‌గా పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె
ఆత్మాహుతి డ్రోన్లు.. అంటే ఏంటి ?? ఉక్రెయిన్ – రష్యా వార్ లో ఈ తరహా డ్రోన్ లు
పనిమనిషి ఇంతకన్నా ఎక్కువే సంపాదిస్తుంది !! కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్ !!
గాజా శిబిరాలలో దువ్వెన, షాంపూ లేక జుట్టు కత్తిరించుకుంటున్న మహిళలు