పనిమనిషి ఇంతకన్నా ఎక్కువే సంపాదిస్తుంది !! కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్ !!
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇటీవల ఇచ్చిన జాబ్ పోస్టింగ్ వైరల్‌గా మారడమే దీనికి కారణం. ఫ్రెషర్‌కు ఏడాదికి రూ.2.5 లక్షలు ఇస్తామని పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఆ సంస్థపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 2024 గ్రాడ్యుయేట్ బ్యాచ్ ఫ్రెషర్ల నుంచి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆగస్టు 14వ తేదీని దరఖాస్తుల సమర్పణకు తుది గడువుగా నిర్దేశించింది.
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇటీవల ఇచ్చిన జాబ్ పోస్టింగ్ వైరల్‌గా మారడమే దీనికి కారణం. ఫ్రెషర్‌కు ఏడాదికి రూ.2.5 లక్షలు ఇస్తామని పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఆ సంస్థపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 2024 గ్రాడ్యుయేట్ బ్యాచ్ ఫ్రెషర్ల నుంచి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆగస్టు 14వ తేదీని దరఖాస్తుల సమర్పణకు తుది గడువుగా నిర్దేశించింది. దీనికి సంబంధించి ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా అనే ఎక్స్ పేజ్ ఈ జాబ్ వివరాలను పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆగస్టు 13న ఈ పోస్ట్ చేయగా దాదాపు 2 మిలియన్ల వ్యూస్ లభించాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ‘ఏడాదికి రూ.2.50 లక్షలు అంటే.. నెలకు సుమారు రూ.20వేలు. ఓ పనిమనిషి ఒక్కో ఇంట్లో సగటున 30 నిమిషాలు చొప్పున రోజుకు 8-10 ఇళ్లల్లో పనిచేస్తే ఇంతకంటే ఎక్కువ మొత్తం సంపాదిస్తుంది’ అని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. ‘ట్యూషన్లు చెప్పినా ఇంతకంటే ఎక్కువ మొత్తం వస్తుంది’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు. ‘వీధిలో తోపుడు బండ్ల వ్యాపారులే నయం.. ఇంకా ఎక్కువ ఆర్జిస్తారు’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు. ఏడాదికి ఇచ్చే ఈ మొత్తంతో మెట్రో నగరాల్లో ఏం చేసుకోవాలి’ అని మరో యూజర్ పోస్ట్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాజా శిబిరాలలో దువ్వెన, షాంపూ లేక జుట్టు కత్తిరించుకుంటున్న మహిళలు
బుర్జ్ ఖలీఫాను మించిన ఎత్తులో విద్యుత్ బ్యాటరీల తయారీ
ఉప్పు, చక్కెరలోనూ డేంజరస్ ప్లాస్టిక్ !! అధ్యయనంలో సంచలన విషయాలు
ఆడపిల్ల పుట్టిందని నా భర్త పట్టించుకోవడం లేదు !! న్యాయం చేయండి !!
నీరు ప్రవహిస్తుండగానే గేటు ఏర్పాటు !! ఇంజినీరింగ్ సాహసమే !!