ఉప్పు, చక్కెరలోనూ డేంజరస్‌ ప్లాస్టిక్‌ !! అధ్యయనంలో సంచలన విషయాలు

ఉప్పు, చక్కెరలోనూ డేంజరస్‌ ప్లాస్టిక్‌ !! అధ్యయనంలో సంచలన విషయాలు

Phani CH

|

Updated on: Aug 16, 2024 | 9:10 PM

నింగి, నేల ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌.. ప్లాస్టిక్‌.. ప్లాస్టిక్‌. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అంతా ప్లాస్టిక్‌మయం. ప్రతీదానిలోనూ ప్లాస్టిక్‌ విషపదార్థాలు అంతర్లీనంగా భాగం అయిపోయాయి. చిన్నాపెద్ద, ప్యాక్‌డ్‌, అన్‌ప్యాక్‌డ్‌ అన్న తేడా లేకుండా ఇండియాలో దొరికే అన్ని ఉప్పు, చక్కెర బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మంగళవారం టాక్సిక్స్‌ లింక్‌ అనే పర్యావరణ హిత సంస్థ విడుదల చేసిన ‘మైక్రోప్లాస్టిక్స్‌ ఇన్‌ సాల్ట్‌ అండ్‌ షుగర్‌’ నివేదికలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి.

నింగి, నేల ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌.. ప్లాస్టిక్‌.. ప్లాస్టిక్‌. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అంతా ప్లాస్టిక్‌మయం. ప్రతీదానిలోనూ ప్లాస్టిక్‌ విషపదార్థాలు అంతర్లీనంగా భాగం అయిపోయాయి. చిన్నాపెద్ద, ప్యాక్‌డ్‌, అన్‌ప్యాక్‌డ్‌ అన్న తేడా లేకుండా ఇండియాలో దొరికే అన్ని ఉప్పు, చక్కెర బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మంగళవారం టాక్సిక్స్‌ లింక్‌ అనే పర్యావరణ హిత సంస్థ విడుదల చేసిన ‘మైక్రోప్లాస్టిక్స్‌ ఇన్‌ సాల్ట్‌ అండ్‌ షుగర్‌’ నివేదికలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. టేబుల్‌ సాల్ట్‌, రాక్‌ సాల్ట్‌, సీ సాల్ట్‌, రా సాల్ట్‌తో పాటు ఐదు రకాల చక్కెరలను పరిశీలించగా.. అన్ని శాంపిళ్లలో 0.1 ఎంఎం నుంచి 5 ఎంఎం పరిమాణం కలిగిన మట్టిపెడ్డలు, ఫైబర్‌, ఫిల్మ్స్‌ బయటపడ్డాయని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా అయోడైజ్‌డ్‌ ఉప్పులో పలు రకాల ఫైబర్‌, ఫిల్మ్‌ మైక్రోప్లాస్టిక్స్‌ కనిపించాయని తెలిపింది. ఒక కిలో ఉప్పులో 6.71 నుంచి 89.15 మైక్రోప్లాస్టిక్‌ ముక్కలు ఉంటున్నాయని నివేదిక వివరించింది. ఆర్గానిక్‌ ఉప్పులో అత్యల్పంగా 6.70 మైక్రోప్లాస్టిక్‌ ముక్కలు, అత్యధికంగా అయోడైజ్‌డ్‌ ఉప్పులో 89.15 మైక్రోప్లాస్టిక్‌ ముక్కలు ఉన్నట్టు వెల్లడించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడపిల్ల పుట్టిందని నా భర్త పట్టించుకోవడం లేదు !! న్యాయం చేయండి !!

నీరు ప్రవహిస్తుండగానే గేటు ఏర్పాటు !! ఇంజినీరింగ్‌ సాహసమే !!

నాలుక రంగు ఆధారంగా 98% వ్యాధి నిర్థారణ

మైక్రో ఓవెన్‌లో వేడిచేసిన ఆహారం తింటున్నారా ?? మీకో షాకింగ్‌ న్యూస్‌ !!

iSmart News: బ్యాంక్ మేనేజర్ చెంపలు వాయించిన లీడర్ !!