నాలుక రంగు ఆధారంగా 98% వ్యాధి నిర్థారణ
గతంలో వైద్యులు రోగుల నాడి చూసి, నాలుక చూసి, లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేసేవారు. దానికి అనుగుణంగా చికిత్స చేసేవారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత వైద్య విధానం పూర్తిగా మారిపోయింది. అన్నీ యంత్రాలతోనే నిర్ధారిస్తున్నారు. తాజాగా మానవ నాలుక రంగును విశ్లేషించి, వివిధ రకాల వ్యాధులను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగల నూతన అల్గోరిథమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ అల్గోరిథమ్‌ను మిడిల్ టెక్నికల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
గతంలో వైద్యులు రోగుల నాడి చూసి, నాలుక చూసి, లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేసేవారు. దానికి అనుగుణంగా చికిత్స చేసేవారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత వైద్య విధానం పూర్తిగా మారిపోయింది. అన్నీ యంత్రాలతోనే నిర్ధారిస్తున్నారు. తాజాగా మానవ నాలుక రంగును విశ్లేషించి, వివిధ రకాల వ్యాధులను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగల నూతన అల్గోరిథమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ అల్గోరిథమ్‌ను మిడిల్ టెక్నికల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ సరికొత్త ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా డయాబెటిస్, స్ట్రోక్, అనీమియా, ఆస్తమా, కాలేయం, పిత్తాశయం సమస్యలు, కోవిడ్-19 వంటి అనేక వ్యాధులను గుర్తించవచ్చు. “నాలుక రంగు, ఆకారం, మందం వంటి లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను సూచిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో 5,260 చిత్రాలను ఉపయోగించి మిషన్ లెర్నింగ్ మోడల్ కు శిక్షణ ఇచ్చారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం రియల్ టైమ్ డయాగ్నోసిస్‌లో ఉపయోగపడుతూ, వైద్య విధానాలను మరింత వృద్ధి చెందేలా చూస్తుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మైక్రో ఓవెన్‌లో వేడిచేసిన ఆహారం తింటున్నారా ?? మీకో షాకింగ్ న్యూస్ !!