మైక్రో ఓవెన్‌లో వేడిచేసిన ఆహారం తింటున్నారా ?? మీకో షాకింగ్‌ న్యూస్‌ !!

మైక్రో ఓవెన్‌లో వేడిచేసిన ఆహారం తింటున్నారా ?? మీకో షాకింగ్‌ న్యూస్‌ !!

Phani CH

|

Updated on: Aug 16, 2024 | 9:05 PM

ప్రస్తుత కాలంలో రెండు పూటలా వంటచేసుకుని తృప్తిగా భోజనం చేసే అవకాశం ఎవరికీ ఉండటం లేదు. భార్య,భర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే వారికి అస్సలు సమయం ఉండదు. తినడానికి కూడా టైమ్‌ ఉండని పరిస్థిలుంటాయి కొందరికి. దీంతో రెండు పూటలకూ సరిపడా ఒక్కసారే వంట చేసుకొని, సాయంత్రం మైక్రో వేవ్‌ ఓవెన్లో వేడి చేసుకొని తింటుంటారు. ఈ మధ్యకాలంలో వీటి వినయోగం బాగా పెరిగింది. ఇలాంటి వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది.

ప్రస్తుత కాలంలో రెండు పూటలా వంటచేసుకుని తృప్తిగా భోజనం చేసే అవకాశం ఎవరికీ ఉండటం లేదు. భార్య,భర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే వారికి అస్సలు సమయం ఉండదు. తినడానికి కూడా టైమ్‌ ఉండని పరిస్థిలుంటాయి కొందరికి. దీంతో రెండు పూటలకూ సరిపడా ఒక్కసారే వంట చేసుకొని, సాయంత్రం మైక్రో వేవ్‌ ఓవెన్లో వేడి చేసుకొని తింటుంటారు. ఈ మధ్యకాలంలో వీటి వినయోగం బాగా పెరిగింది. ఇలాంటి వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎప్పుడో ఒక్కసారి అత్యవసర పరిస్థితిలో వేడిచేసుకుని తింటే పర్వాలేదు కానీ, పదే పదే వేడిచేసుకొని తింటే మాత్రం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ఆహారాన్ని వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు, విటమిన్లు 90 శాతం వరకూ నశించిపోతాయి. అలాంటి ఆహారం తినడం వల్ల శరీరానికి హాని కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మైక్రో వేవ్‌ ఓవెన్‌లో ఆహారాన్ని వేడి చేయడం వల్ల ఆహారంలో కొన్ని మార్పులు వస్తాయి. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. పైగా మైక్రో ఓవెన్‌లో ప్లాస్టిక్‌ పాత్రల్లో ఆహారాన్ని వేడి చేస్తారు. ఇది అస్సలు మంచిదికాదంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

iSmart News: బ్యాంక్ మేనేజర్ చెంపలు వాయించిన లీడర్ !!